Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

-నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేటీఆర్ కు నోటీసు లు
-కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ఎండగడతాం
-బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరదీసారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.

నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసిందని ఆయన పేర్కొంటూ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని దద్దమ్మలు కాంగ్రెస్ పాలకులు అని ఆయన అన్నారు.

ఫార్ములా ఈ కారు రేస్ విషయంలో కేటీఆర్ పై తప్పుడు కేసులు బనాయించి గతంలో విచారించడమే కాక తిరిగి నోటీసులు జారీ చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE