– 5 లక్షల ఫీజ్ కార్డు ఏమైంది?
– స్కూటీ లు ఏమైపాయె?
– 4000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తవని అడగండి
మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: ప్రజాపాలన గ్రామ సభలను రెండు రోజులుగా గమనిస్తుంటే ఈ గ్రామ సభలు బోగస్ సభల ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ ప్రజా పాలన గ్రామ సభల పేరిట ప్రజలను మోసం చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు – 420 హామీలు 100 రోజుల్లో ఇస్తా అని, గద్దెనెక్కి చెప్పింది ఇవ్వమంటే అప్ప్లికేషన్ పేరిట ప్రజలను జిరాక్స్ సెంటర్ లకు, మీ సేవ సెంటర్ లకు, మండలాఫీసుల చుట్టుతా సంవత్సరం పాటు తిప్పుకుంటు ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చటం లేదు.
ఒకసారి మండల ఆఫీసుల్లో అప్ప్లికేషన్ లు ఇవ్వమన్నాడు, రెండవ సారి ప్రజాపాలన కార్యక్రమంలో అప్ప్లికేషన్ లు ఇవ్వమన్నాడు, మూడవ సారి ఇంటింటి సర్వే లో చెప్పుమన్నాడు, తీరా సంవత్సరం గడిచినాక మళ్ళీ నాల్గవసారి గ్రామ సభలల్లో అప్ప్లికేషన్లు ఇవ్వమంటున్నాడు. సంవత్సరం పొడుత ఇచ్చిన అప్ప్లికేషన్ లో ఎటుపోయినయి? ఎక్కడ పడేశారు?
సర్పంచు, MPTC ల ఎన్నికలొస్తున్నాయ్…. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ గ్రామ సభల డ్రామా, ఈ ఎన్నికల అయిపోయినంక గ్రామ సభల్లో ఇచ్చిన అప్ప్లికేషన్లు కూడా పడేస్తారా ? అని ప్రశ్నించారు. ఈ గ్రామ సభలు పేరుకే పెడుతున్నారని మీ కాంగ్రెస్ పార్టీ MLA నాగర్ కర్నూల్ MLA,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ఇండ్లు,రేషన్ కార్డు లు ఇస్తే … ఈ గ్రామ సభలెందుకు ? అధికారుల సర్వే లెందుకు ?
రెండు రోజులుగా చూస్తున్నాం..అనేక గ్రామాల్లో లబ్ధిదారులు వారి పేర్లు లిస్ట్ లో లేకపోతే.. అధికారులను నిలదీస్తున్నరు. మీరు కూడా అడగండి.. మీకు తోడుగా మా గ్రామ BRS పార్టీ కార్యకర్తలు ఉంటారు. భయపడకండి
ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఈ గ్రామ సభల్లో అధికారులను అడగండి.ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధు ను ఇవ్వాలని ఎండాకాలం పంటకు 12000 వేలు కాదు 15000 రైతు భరోసా ఇవ్వాలని. కోడలికి 2500..అత్తకు 4000 పెన్షన్ ఏమయిందని ఈ గ్రామ సభలో అడగండి.తులం బంగారం ఏమయిందని అడగండి.
5 లక్షల ఫీజ్ కార్డు ఏమయిందని.. స్కూటీ లు ఏమయినవి అని… 4000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తవని అడగండి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్ గారికి సూచిస్తున్నా. 10 ఏండ్ల నుండి నా మీద ఏడుస్తున్నవు. ఇప్పటికైనా నా మీద ఏడుపు ఆపి.. మీరు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ కాబట్టి. ముఖ్యమంత్రి తో బాల్కొండ నియోజకవర్గంలోని 31000 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయించు.
మీడియా సమావేశంలో బద్దం ప్రవీణ్ రెడ్డి,నాగధర్ రెడ్డి,దేవేందర్,దోన్ కంటి నర్సయ్య,చౌట్పల్లి రవి,ఆర్మూర్ మహేష్,డొల్ల రాజేశ్వర్,pacs చైర్మన్ లు మోహన్ రెడ్డి,రాజేశ్వర్,సామ మహిపాల్,రేగుళ్ల రాములు, తదితరులు పాల్గొన్నారు