– కరీంనగర్ -నిజామాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం
– సోషల్ మీడియాలో వైరల్
జగిత్యాల కి వెళ్లే మార్గంలో రాత్రి గంగాధర పరిధిలో నాలుగు వాహనాలు అదుపుతప్పి ఢీ కొన్నాయి…. ఇందులో ఒకటి లారీ కాగా రెండు వ్యాన్ లు ఉన్నాయి. ఇదే ప్రమాదంలో జగిత్యాల కు చెందిన ప్రైవేట్ బస్ నుజ్జు నుజ్జు అయింది..కంటైనర్ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోవడం తో పాటు అతని తలకు తీవ్ర
గాయాలయ్యాయి .ఇక బస్సులోనూ ఇతర వ్యాన్ లో ఉన్న దాదాపు పదిమందికి సైతం తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇక ఒక వ్యాన్లో కోడి గుడ్ల లోడ్ ఉండటం తో దాంట్లో ఉన్న గుడ్లు మొత్తం రోడ్డు పై పడిపోయాయి. దీంతో ఊరి జనం పెద్దఎత్తున కోడిగుడ్లు ఎగబడి తీసుకెళ్తున్నారు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.