– అసలు తుపాకులు వారి దగ్గరకు ఎలా వచ్చాయి?
– రోహిణ్ రెడ్డి , ఫహీమ్ ఖురేషి , తిరుపతి రెడ్డి గెస్ట్ హౌజ్ ల దగ్గర నిఘా పెట్టొచ్చుకదా?
– మాఫియా డాన్ లు మంత్రులయ్యారు
– డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సీఎం సన్నిహితుడు రోహిణ్ రెడ్డి , కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ పై ఎందుకు కేసులు నమోదు చేయలేదు ?
– సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయట పడ్డాయి.
– ఉత్తమ్ ,రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడతాయి
– రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలి
– బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైంది. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో హై డ్రామా నడుస్తోంది. మంత్రి నివాసం నుంచి నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటకు తీసుకు రాలేక పోయారు. మాఫియా డాన్ లు మంత్రులు అయ్యారు. ప్రజల జీవితాలతో వారు ఆడుకుంటున్నారు
.రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి గా మారింది. సామాన్యుడికో న్యాయం మంత్రులకు ఓ న్యాయమా ? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ నడుచుకుంటూ వస్తే పోలీసులు కేసు పెట్టారు.మా బీ ఆర్ ఎస్ నాయకుడు క్రిశాంక్ సోషల్ మీడియా లో పోస్టు పెడితే పది కేసులు పెట్టారు.
మంత్రికి సంబందించిన మనిషి పై కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయలేదు. సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నల్ల బాలు , గౌతమ్ తదితరులను రోజుల తరబడి జైల్లో పెట్టారు. యూరియా కోసం అడిగిన గిరిజన రైతును మిర్యాల గూడ లో రోకలి బండలు ఎక్కించారు.
డెక్కన్ సిమెంట్ వారిని బెదిరించిన సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి , కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ పై ఎందుకు కేసులు నమోదు చేయ లేదు ? పోలీసులు కొండా సురేఖ నివాసం వద్ద ప్రేక్షకులుగా మారిపోవడం దారుణం. ఉత్తమ్ ,రేవంత్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయట పడతాయి సచివాలయం లో ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారాలు ప్రైవేట్ గెస్ట్ హౌజ్ ల్లో జరుగుతున్నాయి.
రోహిన్ రెడ్డి ,సుమంత్ గన్ లు పెట్టి ఎలా బెదిరిస్తారు ? అసలు తుపాకులు వారి దగ్గరకు ఎలా వచ్చాయి? కొండా సురేఖ కూతురు మాటల్లో ప్రభుత్వ పెద్దల చీకటి దందాలు బయట పడ్డాయి. మాఫియా డాన్ ల చేతికి రాష్ట్రం వెళ్లిందా ? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులతో ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు కట్టలేదు.
కమిషన్ల కోసం మంత్రులు బాహాటంగా కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ ,వివేక్ , పొన్నం ప్రభాకర్ , సీతక్క , పొంగులేటి లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్ ముందట ఇంటెలిజెన్స్ పెట్టె బదులు రోహిణ్ రెడ్డి , ఫహీమ్ ఖురేషి , తిరుపతి రెడ్డి గెస్ట్ హౌజ్ ల దగ్గర నిఘా పెట్టొచ్చుకదా? రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యాజమాని సుఖంగా లేడు. ఆర్ ఆర్ టాక్స్ భాదితులు ఎక్కువయ్యారు.
గురుకులాల్లో మరణ మృదంగం కొనసాగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు
108 మంది విద్యార్థులు చనిపోయారు. మధ్యాహ్న భోజన సిబ్బందికి ,,మిషన్ భగీరథ సిబ్బందికి జీతాలు లేవు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ,హెడ్ మాస్టర్లు పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు.
సీఎం అనుచరులు ఒక్కో ఏరియా ను పంచుకుని వసూళ్లు సెటిల్ మెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు ?వారిని ప్రేక్షకులుగా మార్చారు. గ్యాంగుల పాలన ఎక్కువైంది .గ్యాంగులకు మంత్రులు నాయకులుగా మారారు. రాష్ట్రంలో గన్ కల్చర్ ,మాఫియా పాలన పోవాలంటే రేవంత్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలి.
జూబిలీ హిల్స్ లో బీ ఆర్ ఎస్ గెలవకపోతే మాఫియా పాలన పెరిగిపోతుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమకు పాలన చేతకావడం లేదని తప్పుకోవాలి. మాఫియా కేబినెట్ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచే మొదలైంది
సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు : దూదిమెట్ల బాలారాజు యాదవ్…
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు. బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే చట్టప్రకారం ముందుకువెళ్ళాలి. బీసీలను రేవంత్ రెడ్డి
ప్రభుత్వం మోసం చేస్తోంది. ఠాగూర్ సినిమాను తలపించే విధంగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యవహారం ఉంది..బీసీలను ఎన్నిసార్లు మోసం చేస్తారు?
మీరు కుర్చీ ఎక్కడానికి బీసీలు ఉపయోగపడ్డారు. సర్వే తప్పులతడక ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆరోపించారు.బీసీ బిల్లులను రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండటంతో ఆర్డినెన్స్ తెచ్చారు. ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోవడంతో జీఓ నంబర్ 9 తెచ్చారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలు హడావిడి చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేస్తే బిఆర్ఎస్ సపోర్టు చేస్తుందని కేటిఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బీసీలు బొంద పెట్టడం ఖాయం.
ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ ,రామచంద్రు నాయక్, బీ ఆర్ ఎస్ నేతలు కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ , బద్రుద్దీన్ పాల్గొన్నారు.