– నవీన్ యాదవ్ ను చంచల్ గూడ జైలుకు పంపుదాం
– ఓటమికి భయపడే అజారుద్దిన్ కు మంత్రి పదవి
– కేసిఆర్ పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు
– రేవంత్ రెడ్డి చుట్టూ రౌడీలు గుండాలు .. కేసిఆర్ చుట్టూ మహిళలు
వ్యభిచార గృహాలు నిర్వహించే పహిల్వాన్ లను గెలిపిస్తే, మహిళల పరిస్థితి ఏం కావాలి
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్ డా.ఆర్ఎస్ ప్రవీణ కుమార్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నా అడ్డా, బిఆర్ఎస్ నాయకులను జూబ్లిహిల్స్ దాటనివ్వనని వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే చంచల్ గూడ జైలుకు పంపుతామని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. నవీన్ యాదవ్ అడ్డా జూబ్లిహిల్స్ కాదు చంఛల్ గూడ అని స్పష్టం చేశారు.
బోరబండ నియోజకవర్గంలోని వీకర్ సెక్షన్ సైట్ 3 లో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. బోరబండలో వీధి వ్యాపారం చేసుకునే వాల్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తోన్న, హిజ్రాల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేసే స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దిన్ ను కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకు పంపుతామన్నారు.
జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే మైనారీటీల ఓట్లను ఆకర్షించడానికి క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తీసుకుంటున్నారన్నారు. కేసిఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
200 ఉన్న ఫించన్ కేసిఆర్ 2000 కు పెంచారన్నారు.ఇంటింటికీ ఉచితంగా నీటి సరఫరా చేస్తే,రేవంత్ రెడ్డి వచ్చి నెలనెలా బిల్లులు వేస్తున్నారని విమర్శించారు. పేదల కోసం కేస్ఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తే రేవంత్ రెడ్డి వచ్చి కూలగొడుతున్నారని తెలిపారు.
జూబ్లిహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చుట్టూ రౌడీలు గుండాలు ఉంటే, కేసిఆర్ చుట్టూ మహిళలు ఉన్నారన్నారు. మహిళలకు,రౌడీలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో మహిళలు గెలవాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గెలిస్తే బుల్డోజర్ వస్తుందన్నారు. వ్యభిచార గృహాలు నిర్వహించే పహిల్వాన్ లను గెలిపిస్తే, మహిళల పరిస్థితి ఏం కావాలో ఆలోచించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేసిఆర్ ఓడిపోయాక కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,కేసిఆర్ కిట్,బస్తీ దవాఖాన లు అన్ని బంద్ అయ్యాయని, ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేశారన్నారు. ఫ్రీ బస్ అని చెప్పి మగవారికి డబుల్ చార్జీలు చేశారని విమర్శించారు. స్థానిక నాయకులు కృష్ణమోహన్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.