Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల విడుదల

– హడ్కో అంగీకారం

ముంబయి: అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల విడుదలకు హడ్కో అంగీకారం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గత అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ హడ్కో సీఎండీకి వివరించారు.

ఈ నేపథ్యంలో, తాజాగా ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని, అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధుల కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

LEAVE A RESPONSE