ఆంధ్రప్రదేశ్‌కు రూ. 22,223 కోట్ల ఆహార సబ్సిడీ

– ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆహార & ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రి పీయూష్ గోయల్ సమాధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ 2019 నుండి ఇప్పటి వరకు ఆహార సబ్సిడీగా రూ. 22,222 కోట్లు పొందింది. ఈరోజు రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన నక్షత్రం గుర్తు ఉన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో విడుదల చేసిన ఆహార సబ్సిడీ క్రింది విధంగా ఉంది: (రూ. కోట్లు)
2021-22 Rs.6,393 Crore (Till Feb 7,2022)
2020-21 8,425
2019-20 7,404
2018-19 4,543
2017-18 6,060
2016-17 3,213

తెలంగాణ రాష్ట్రం కూడా గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా ఆహార సబ్సిడీని అందుకుంది. తెలంగాణకు గత ఐదేళ్లలో విడుదల చేసిన ఆహార సబ్సిడీ ఈ విధంగా ఉంది: (రూ. కోట్లు)
2021-22 Rs.6,897 Crore (Till Feb 7,2022)
2020-21 6,880
2019-20 4,859
2018-19 2,559
2017-18 3,854
2016-17 1,717

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), 2013 కింద లబ్ధిదారుల కవరేజీని పెంచాలని కోరుతూ భారత ప్రభుత్వానికి AP రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన గురించి అడిగిన ప్రశ్నకు, పీయూష్ గోయల్, అన్ని రాష్ట్రాలకు లబ్ధిదారుల కవరేజీని 2013లో అప్పటి ప్రణాళికా సంఘం NSSO గృహ వ్యయ సర్వే 2011-12 ఆధారితంగా నిర్ణయించిందని చెప్పారు. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ జనాభాలో 61% మరియు పట్టణ జనాభాలో 41% NFSA కింద ప్రయోజనాలను పొందుతున్నట్లు మంత్రి పార్లమెంటుకు తెలిపారు.

Leave a Reply