– భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్న మహిళ
– ఆన్లైన్లో నిర్వహించిన పోటీలో పాల్గొన్న 35 వేల మంది మహిళలు
– ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేన్ ప్రపంచ ముగ్గుల పోటీ
శ్రీకాకుళం: మల్లా సునీత అనే మహిళ అద్భుతమైన ముగ్గు వేసి రూ. 25 లక్షల ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఏఏఏ) ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి 35 వేల మందికి పైగా పాల్గొన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా 14 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవు ఉన్న ఈ ముగ్గును ఆమె ఐదు రోజుల్లో పూర్తి చేశారు. ఈ ముగ్గు వేయడానికి 19 కిలోల పిండి వాడారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సునీత గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటూ తెలుగు పిల్లలకు ముగ్గులు నేర్పిస్తున్నారు. ఆమె ఆగస్టు 30న గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఈ బహుమతి అందుకున్నారు.