– అధికారుల సమీక్షలో విప్, ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ : ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్నారని, భారీగా నిధులు తెస్తున్నారని ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కాకానీ నగర్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ, విద్యుత్, ఆర్.డబ్య్లుయస్, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడారు. వైసీపీ అరాచక పాలన వల్ల గాడి తప్పిన వ్యవస్థల్ని ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు సరిదిద్దారని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారని సౌమ్య తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, గ్రామాల మధ్య సరైన రోడ్లు లేక ఐదేళ్లుగా అవస్థలు పడుతున్నారని తెలిపారు. మరలా కూటమి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో రోడ్ల సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో మెలగాలని పేర్కొన్నారు. అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తీసి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట చేసేప్పుడు, మంచినీటి పైపులైన్ల నిర్మాణంలోనూ, ఆక్రమణలకు గురైన రహదారులను ఖాళీ చేయించే క్రమంలో పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.