పర్యావరణ అనుకూల సాగరతీరంగా రుషికొండ

-ఏపీ నుంచి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్
-వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

పర్యావరణ అనుకూల సాగరతీరంగా రుషికొండ బీచ్ అత్యంత అరుదైన గుర్తింపు పొందిందని ప్రముఖ డెన్మార్క్ పర్యావరణ అధ్యయన సంస్థ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అందించిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.

సుమారు 33 అంశాల్ని పరిగణనలోకి తీసుకొని డెన్మార్క్ పర్యావరణ అధ్యయన సంస్థ స్వచ్ఛమైన బీచ్ లకు బ్లూ ఫ్లాగ్ అందిస్తున్నదని అన్నారు. భారతదేశంలో 12 బీచ్ లకు అరుదైన గుర్తింపు లభించగా ఏపీ నుంచి ఆ గుర్తింపు పొందిన ఒకే బీచ్ రుషికొండ అని అన్నారు. రుషికొండ బీచ్ కు డెన్మార్క్ సంస్థ మూడుసార్లు బ్లూ ఫ్లాగ్ రెన్యువల్ చేసిందని అన్నారు.

స్వయం ఉపాధితో అక్కచెల్లెమ్మలకు ఆర్థిక స్వాతంత్య్రం
స్వయం ఉపాధితో అక్కచెల్లెమ్మలకు ఆత్మ గౌరవం పెరిగిందని, ఆర్దిక స్వాతంత్య్రం లభించిందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో వారి తలరాతలు మారాయని అన్నారు. చేయూత, ఆసరా పథకాలతో పేద మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్రంలో సుమారు 7.76 లక్షల మంది మహిళలు సొంత కాళ్లపై నిలదొక్కుకున్నారని అన్నారు. నగరాలు, పట్టణాల్లో మహిళలు చిరు వ్యాపారాలకు శ్రీకారం చుట్టారని అన్నారు

2004, మే 14 తేదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరిచిపోని రోజు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2004 మే 14 మరిచిపోలేని రోజని, పదేళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడి, ఇదే రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారని ఆయన గుర్తుచేశారు.

Leave a Reply