Suryaa.co.in

Andhra Pradesh

22 గేట్ల ద్వారా సాగర్‌ నీరు విడుదల

మాచర్ల: నాగార్జున సాగర్ 22 క్రస్ట్ గేట్ల ద్వారా 3 లక్షల 41 వేల 990 క్యూసెక్కుల నీటిని అధికారులు మంగళవారం విడుదల చేశారు. 2 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల నీరు 20 క్రస్ట్ గేట్ల ద్వారా 10 మేర నీటిని విడుదల చేశారు. కాగా, 3 లక్ష 41 వేల 990 క్యూసెక్కుల నీరు వచ్చి నాగార్జున సాగర్ కు చేరుతోంది.

ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 585.40 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం- 312 టిఎంసిలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.3005టీఎంసీలు. ఇన్ ఫ్లో : 341990క్యూసెక్కులు కాగా, టోటల్ ఔట్ ఫ్లో 341990 క్యూసెకులు.

LEAVE A RESPONSE