సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి వారం రోజుల నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాకాబందీ నిర్వ‌హిస్తున్నారు. రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ.10 ల‌క్ష‌లు బ‌హుమానం ఇస్తామ‌ని చెప్పారు. పోలీసుల‌పై కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రాజు చివ‌ర‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్ మీద శ‌వ‌మై క‌నిపించారు.