Suryaa.co.in

Andhra Pradesh

ఫలించిన సాన సతీష్ కృషి!

ఈ నెల 29 వ తేదీన విజయవాడ లో నిర్వహించ తలపెట్టిన “కాపు సదస్సు ” ను రద్దు చేయాలని శుక్రవారం కాకినాడ లో జరిగిన తూర్పు గోదావరి లోని కొందరు కాపులు హాజరైన సమావేశం లో నిర్ణయించారు.

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యాలయం లో ఈ సమావేశం జరిగింది. ఆయన కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.
విజయవాడ లో జరగవలసిన ఉన్న ఈ “కాపు ” సమావేశం వెనుక వైసీపీ ఉన్నదనే ప్రచారం కూడా బాగానే జరిగింది. దాని వెనుక వైసీపీ ఎంఎల్సీ తోట త్రిమూర్తులు ఉన్నట్టు కూడా ప్రచారం జరగడం తో, వైసీపీ వెనుక ఉన్నదన్న ప్రచారానికి ఊపు వచ్చింది. దీనికి తో వైసీపీ ప్రచార మాధ్యమాల్లో కూడా కాపులకు సంబంధించి “29 న ఏదో జరగబోతోంది ” అన్న ప్రచారం కూడా బాగానే జరిగింది.

ఈ నేపథ్యం లో కాకినాడ లో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.

సుమారు ఓ 65 నుంచి డెబ్బయ్ మంది వరకు పాల్గొన్నారు. (సానా సతీష్ కార్యాలయం చాలా పెద…

[20:46, 27/06/2025] Raidu New: కాపు సమావేశం క్యాన్సిల్!

ఈ నెల 29 వ తేదీన విజయవాడ లో నిర్వహించ తలపెట్టిన “కాపు సదస్సు ” ను రద్దు చేయాలని శుక్రవారం కాకినాడ లో జరిగిన తూర్పు గోదావరి లోని కొందరు కాపులు హాజరైన సమావేశం లో నిర్ణయించారు.

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కార్యాలయం లో ఈ సమావేశం జరిగింది. ఆయన కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.

విజయవాడ లో జరగవలసిన ఉన్న ఈ “కాపు ” సమావేశం వెనుక వైసీపీ ఉన్నదనే ప్రచారం కూడా బాగానే జరిగింది. దాని వెనుక వైసీపీ ఎంఎల్సీ తోట త్రిమూర్తులు ఉన్నట్టు కూడా ప్రచారం జరగడం తో, వైసీపీ వెనుక ఉన్నదన్న ప్రచారానికి ఊపు వచ్చింది. దీనికి వైసీపీ ప్రచార సాధనాల్లో ల కూడా కాపులకు సంబంధించి “29 న విజయవాడ లో ఏదో జరగబోతోంది ” అన్న ప్రచారం కూడా బాగానే జరిగింది.

ఈ నేపథ్యం లో కాకినాడ లో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.
సుమారు ఓ 65 నుంచి డెబ్బయ్ మంది వరకు పాల్గొన్నారు. (సానా సతీష్ కార్యాలయం చాలా పెద్దది ). కోనసీమ నుంచి ఓ పాతిక మంది, జిల్లాలోని మిగిలిన ప్రాంతాలనుంచి ఓ ముప్ఫయ్ మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.

“కాపు ఉద్యమం” అంటూ ముద్రగడ పద్మనాభం ను నిండా చెడగొట్టి, దేనికీ పనికిరాకుండా చేసిన వారిలో ముఖ్యుడైన వాసిరెడ్డి ఏసుదాసు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.

విజయవాడ లో “కాపు సదస్సు” పేరిట హడావుడి చేస్తూ చక్రం తిప్పాలని ఉవ్వి ళ్ళూరిన కొన్ని వాన పాములు ( త్రాచు పాములు ఒకచోట చేరి సమావేశం పెట్టుకుంటే… మేమూ పాములమే కదా అంటూ కొన్ని వాన పాములు కూడా వచ్చినట్టుగా )ఈ సమావేశానికి వచ్చి కాసేపు బుస్… బుస్ మన్నాయి. ఎం ఆర్ పీ ఎస్, మందా కృష్ణ మాదిగ రేంజ్ లో ఉద్యమాలు చేయాలని, భారీ స్థాయిలో రిజర్వేషన్లు సాధించేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టేది లేదంటూ హడావుడి చేశాయి.

అయితే, ఉద్యమాలు కరెక్ట్ కాదని ; కాపులకు కార్పొరేషన్ గానీ, ఉపాధి అవకాశాలు కల్పించింది గానీ చంద్రబాబు నాయుడే అని సమావేశం లో పాల్గొన్న కొందరు వక్తలు పేర్కొన్నారు. మంజునాధ్ కమిషన్ ఆధారం గా కాపులకు విద్య, ఉపాధి అవకాశాల్లో 5 శాతం రిజెర్వేషన్ లు కల్పించింది చంద్రబాబు నాయుడే అని కొందరు వక్తలు గుర్తు చేశారు. అలాగే, కేంద్రం కల్పించిన ఈడబ్లియుఎస్ 10 శాతం రిజెర్వేషన్ లలో 5 శాతం కాపులకు కేటాయిస్తూ, జీ. ఓ. నంబర్ 45 జారీ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే కదా అని వక్తలు కొందరు చెప్పారు.

అది అమలు చేసే లోపునే ఎన్నికలు వచ్చాయని, చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి వచ్చి ఉన్నట్టయితే ; జీ ఓ నంబర్ 45 అమల్లోకి వచ్చి ఉండేదని ఒక వక్త చెప్పారు. కానీ, కాపులు వారి గొయ్యి వారే తవ్వుకున్నారన్న భావనను కొందరు వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఆ జీ ఓ అమలుకు కృషి చేసే దానికి, ఉద్యమం ఎందుకంటూ నిలదీశారు.

నిజానికి, ఆంధ్రాలో ఉద్యమానికి ఢిల్లీ లో ఉండే పెంటపాటి పుల్లారావు ను స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పెట్టి చక్రం తిప్పాలని చూసిన వారికి, ఈ సమావేశం లోని వక్తల అభిప్రాయాలతో బాగా నీరసం వచ్చింది.

సమావేశం లో పాల్గొన్న ఎం పీ సానా సతీష్ తో కూడా సమావేశం లో నుంచే పెంటపాటి పుల్లారావు తో మాట్లాడించారు. తాను ఢిల్లీ వచ్చినప్పుడు, ఈ అంశం మీద సవివరం గా మాట్టాడతానని సానా సతీష్ ఫోన్ లో పెంటపాటి పుల్లారావు తో చెప్పారు.

ఈ పరిణామలతో, 29 వ తేదీన విజయవాడ లో ఏర్పాటు చేయదలచిన ” కాపు సదస్సు” ను రద్దు చేస్తున్నట్టు, విజయవాడ హడావుడి నిర్వాహకులు ప్రకటించారు.

జీ ఓ నంబర్ 45 ను చంద్రబాబు ప్రభుత్వమే జారీ చేసినందున, దానిని అమలు చేయించేందుకు కృషి చేయాలని కొందరు టీడీపీ ముఖ్యలు సానా సతీష్ ను కోరారు.

భోగాది వేంకట రాయుడు

 

LEAVE A RESPONSE