Suryaa.co.in

Telangana

ఖేడ్ లో త్వరలో గడీల పాలనకు చరమగీతం

-సవాల్ స్వీకరించకుండా ఎమ్మెల్యే తప్పించుకున్నాడు
-దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప డిమాండ్

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నారాయణఖేడ్ లో గడీల పాలన అంతమై బిజెపి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప జోష్యం చెప్పారు. నారాయణఖేడ్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమ్మెల్యే పై సంగప్ప ఫైర్ అయ్యారు.స్థానిక ఎమ్మెల్యే బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారుఇటీవల తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే తప్పించుకుంటున్నాడని సంగప్ప పేర్కొన్నారు.

బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ఈసారి రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఎన్ని కేటాయించారు? మంజీరాపై ఉన్న ఆరు లిఫ్టులు ఎందుకు రిపేర్ చేయట్లేదు? గ్రామాలకు దెబ్బతిన్న రోడ్లపై చెప్పులు లేకుండా నడవగలరా? అని తాను వేసిన సవాళ్లు స్వీకరించకుండా ఎమ్మెల్యే తోక ముడిచారని సంగప్ప అన్నారు. అవగాహన లేకుండా కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం నిధులు రాకపోతే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని అని చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి ఒక్క పైసా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

పట్టణంలోని ఆక్సిజన్ పార్క్ శామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు.పట్టణంలోని అతి కొద్ది ఇల్లు లబ్ధిదారులకు ఎందుకు పంచట్లేదని సంగప్ప ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పి బిజెపిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.ప్రెస్ మీట్ లో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, సీనియర్ నేత సాయిరాం రమేష్ యాదవ్, ర్యాలమడుగు రామకృష్ణ, రాజు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE