సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలు కాదు

– రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం సర్పంచ్‌లు ఉద్యమించాలి
– జగన్ రెడ్డి ఇచ్చిన ఇంటి జాగాలు ఎక్కడన్నా నివాసయోగ్యంగా ఉన్నాయా?
– టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లు పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు?
– రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. హత్యా రాజకీయాలు చేసే వారు రాజకీయాల్లో అనర్హులు
– రెండో రోజు సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు నాయుడు

అమరావతి: సర్పంచ్‌లకు రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు. కేంద్రం నుంచి కూడా నిధులు డైరెక్ట్ గా మీ అకౌంట్ కు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తామంటే కుదరదు. సర్పంచ్ లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సర్పంచ్ లకు మాత్రమే దేశంలో చెక్ పవర్ ఉంది. నిర్ణయాధికారాలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ అధికారాలను కైవసం చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

గ్రామ వాలంటీర్, సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి సర్పంచ్ అధికారాలకు కోత పెడుతున్నారు. సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాలు కాదు. పంచాయతీ ఎన్నికలు ఇంత అధ్వానంగా ఎప్పుడూ జరగలేదు. కౌంటింగ్ సమయంలోనూ అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. స్థానిక సంస్థలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని సర్పంచ్ లు గుర్తుంచుకోవాలి. మీ గ్రామంలో మీ హక్కుల కోసం పోరాడాలి. ఇందుకు ఈ అవగాహన సదస్సు నాంది కావాలి. నరేగాకు డబ్బులు సర్పంచ్ లే ఇవ్వాలి.

సర్పంచ్ లకు టీడీపీ హయాంలో 64 అధికారాలు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు అభినందనలు. టీడీపీ హయాంలో 30వేల కి.మీ
sarpanch1 సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే 7వేల కేంద్రాలు ఏర్పాటుచేశాం. ఇప్పుడు వైసీపీ రంగులు వేసుకుంటున్నారు. 30 లక్షల మరుగుదొడ్లు టీడీపీ హయాంలో నిర్మించడం జరిగింది. గ్రామాల్లో 21 లక్షల ఎల్ ఈడీ బల్బులు టీడీపీ హయాంలో పెట్టాం. 4,950 పంచాయతీ బిల్డింగ్ లు, 3,565 అంగన్ వాడీ భవనాలు, 2250 స్మశానాలు నిర్మించడం జరిగింది.

పంచాయతీలకు 100 అవార్డులు వచ్చాయి. ఉపాధి హమీ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవడం జరిగింది. 7,650 కోట్లు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి. నేడు వెయ్యి కోట్ల విద్యుత్ బకాయిలు పెట్టారు. సర్పంచ్ ల సంతకాలు లేకుండా నిధులు డైవర్ట్ చేయడం అనైతికం, చట్టవిరుద్ధం. ఇప్పటికి రూ.26 వేల కోట్లు నరేగా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఏమయ్యాయి? ఒక్క రోడ్డు వేయలేదు. స్టాండింగ్ కమిటీ నివేదికలో రూ.970 కోట్ల అవినీతి జరిగితే.. అందులో ఏపీ నుంచే రూ.261 కోట్ల అవినీతి జరిగింది. పెద్దఎత్తున అవినీతి ఎక్కడ ఉందంటే రాష్ట్రంలోనే.

జగన్ రెడ్డి ఇచ్చిన ఇంటి జాగాలు ఎక్కడన్నా నివాసయోగ్యంగా ఉన్నాయా? టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదు. రూ.250 ఉన్న సిమెంట్ ధర రూ.450కు చేరింది. అంతా భారతి సిమెంట్ కు దోచిపెడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పల్లె వెలుగు విమానం పథకం రేపో, ఎల్లుండో
sarpanch2 తీసుకువస్తారు. టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుక, చంద్రన్న బీమా, విదేశీ విద్య, చంద్రన్న బీమా వంటి పథకాలను రద్దు చేశారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన వ్యక్తి వరకు టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం.

పోలవరంతో పాటు హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలని నేను ఆలోచించా. ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డిని చూసి పెద్ద పోటుగాడని భావించిన ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారు. ట్రాప్ లో పడ్డారు. ఒక్కసారని చెప్పి కరెంట్ తీగలు పట్టుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. కరెంట్ ఎక్కడా లేదు. బట్టలు ఆరేసుకోవాలి. జగన్ రెడ్డి అప్పుడు ముద్దులు, ఇప్పుడు గుద్దులు. వ్యవసాయానికి మోటార్లకు మీటర్లు పెడుతూ రైతు మెడకు ఉరితాడు బిగిస్తున్నారు.

ఆనాడు మీటర్లు తీసేసిన ఘనత ఎన్టీఆర్ ది. నా పాలనలో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి మిగులు విద్యుత్ సాధించాం. కరెంట్ ఛార్జీలు పెంచలేదు. అవసరమైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాం. ఇప్పుడు 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి రూ.12 వేల కోట్ల భారం మోపారు. మళ్లీ పెంచుతారు. రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. 37 వేల కోట్ల డబ్బులు వస్తే.. జెన్ కో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోయారు. టీడీపీ హయాంలో జీతం రాని రోజు లేదు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పు రూ.7 లక్షల కోట్లకు చేరింది.

రాష్ట్రం అంధకారంలో ఉంది. రూ.2500 కోట్ల నరేగా బిల్లులు పెండింగ్ లో పెడితే కోర్టు ద్వారా రూ.1500 కోట్లు రావడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ లు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేరు. నిధులు, విధులు, బాధ్యతలు రాజ్యాంగం ఇచ్చింది. వ్యక్తులు శాశ్వతం కాదు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైసీపీ ఫేక్ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బాబాయి వివేకానందరెడ్డిని చంపి టీడీపీపై నెపం వేస్తున్నారు. సీబీఐ విచారణ కావాలని అడిగి ఇప్పుడు వద్దంటున్నారు.

అందరినీ మోసం చేసి ఇప్పుడు సీబీఐపై ఎదురుదాడి చేస్తున్నారు. హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఛార్జ్ షీట్ లో స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తులను వెనకేసుకు వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పరిటాల రవిని పార్టీ ఆఫీసులోనే చంపారు. చంపినవాళ్లందరినీ జైలులో, బయటా చంపారు. ఇప్పుడు కూడా వివేకా హత్య కేసులో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడని చెబుతున్నారు. దీనిపైనా అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. హత్యా రాజకీయాలు చేసే వారు రాజకీయాల్లో అనర్హులు.సర్పంచ్ ల హక్కుల సాధన కోసం టీడీపీ అండగా ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తో పాటు ప్రతాప్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వినోద్ రాజ్, సుబ్బరామయ్య, ముత్యాలరావు, సుజాత, ధనుంజయ యాదవ్, ఇస్మాయిల్, వసుధ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు ప్రకాశం, నెల్లూరు, తూ.గో. జిల్లాల సర్పంచులు హాజరయ్యారు.

Leave a Reply