Suryaa.co.in

Telangana

ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా?

బతుకమ్మ పండగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కవిత
ఎంపీ అరవింద్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి
పెట్టుబడుల కుంభ కోణం లో రాహుల్ బెయిల్ పై ఉన్నారు
మంత్రి సత్యవతి రాథోడ్

రాహుల్ గాంధీ షో లు ప్లాప్ షో లు గా మారాయి. కాంగ్రెస్ కు అధికారం రావడం కల్ల అని తెలిసి ఆ పార్టీ నేతలు అసహనం తో మాట్లాడుతున్నారు. బతుకమ్మ పండగను అవమాన పరిచేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. తక్షణమే జీవన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలి.

బతుకమ్మ పండగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కవితయే. బతుకమ్మ ను మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరం.ప్రియాంకకు మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మను ఇచ్చారా?జగిత్యాలలో ఓటమి ఖాయం అని తెలిసి జీవన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను అవమానించి నట్టు కాదు ..మొత్తం తెలంగాణ మహిళలనే అవమానించారు. ఢిల్లీ పెద్దల దగ్గర కాంగ్రెస్ నేతలు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టు పెట్టారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి.

కాంగ్రెస్ కు 2018 లో వచ్చినన్నీ సీట్లు ఇపుడు రావు. రాహుల్ గాంధీ వి పరిపక్వత లేని మాటలు. కేసీఆర్ ఏ తప్పు చేశారని కేసులు పెడతారు? నేషనల్ హెరాల్డ్ పత్రికలో పెట్టుబడుల కుంభ కోణం లో రాహుల్ బెయిల్ పై ఉన్నారు ..ఆయన నీతులు చెబుతారా?

LEAVE A RESPONSE