Suryaa.co.in

Andhra Pradesh

సవిత అమ్మ మనస్సు

* మహానాడు డైనింగ్ ప్రాంగణంలో కార్యకర్తలకు ఆప్యాయ పలుకరింపు
* భోజనం చేశారా…? అంటూ ఆరా
* స్వయంగా అన్నం వడ్డించిన మంత్రి సవిత
* లక్ష వాటర్ బాటిళ్ల పంపిణీ

కడప : భోజనం చేశారా… బాగుందా… కడుపునిండా భోజనం చేయండి… ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ మహానాడులో ఏర్పాటు చేసిన డైనింగ్ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యకర్తనూ పేరు పేరునా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. తానూ కూడా కార్యకర్తలకు అన్నం వడ్డిస్తూ మంత్రి సవిత అమ్మ మనసు చాటుకున్నారు.

కడపలో మూడో రోజు జరిగిన టీడీపీ మహానాడులో భోజన ఏర్పాట్లను, ఆహార పదార్థాల తయారీని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత గురువారం పరిశీలించారు. మహానాడు భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షలకు పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలొస్తున్నారని, వచ్చే వారి సంఖ్యను అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేయాలని నిర్వాహాలకు మంత్రి స్పష్టంచేశారు.

గడిచిన రెండ్రోజులు రుచికరమైన ఆహారాన్ని అందించారని అభినందించారు. మూడో రోజు కూడా రుచికరమైన ఆహారాన్ని అందేలా చూడాలన్నారు. తిన్న తరవాత పేపర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ ప్రాంగణంలో మంత్రి కలియ తిరిగారు.

ప్రతి కార్యకర్తనూ కలిసి భోజనం చేశారా.. బాగుందా..? అంటూ ఆరా తీశారు. స్వయంగా మంత్రి సవిత కూడా కార్యకర్తలకు అన్నం వడ్డిస్తూ ఏ ప్రాంతం నుంచి వచ్చారో అడిగి తెలుసుకుని, ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష వాటర్ బాటిళ్ల పంపిణీ
మహానాడు బహిరంగ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ తమ్ముళ్లకు మంత్రి సవిత దాహార్తిని తీర్చారు. తనయుడు జగదీశ్ సాయి జన్మదిన సందర్బంగా మహానాడు ప్రాంగణంలో లక్ష వాటర్ బాటిళ్ల ను మంత్రి సవిత పంపిణీ చేశారు.

LEAVE A RESPONSE