– ఎస్సీ వర్గీకరణ అమలు తో అత్యంత వెనకబడ్డ కులాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ చేరుతాయి
– మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ ను స్వాగతిస్తూ అందుకు కృషి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గారిని 57 ఎంబిఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘకాలం పాటు పోరాటం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీ వర్గీకరణ పై చిత్తశుద్దితో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీనియర్ అడ్వకేట్స్ తో కేసును వాదించామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు.
దళితుల్లో అత్యంత వెనుకబడ్డ దళిత కులాల కు సామాజిక న్యాయం చేయడానికి కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏ కులానికి, మతానికి నష్టం జరగదన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసిన 57 ఎంబిఎస్సీ కులాల ప్రతినిధులు దళితుల్లో అత్యంత వెనుకబడ్డ 57 ఎంబి ఎస్సీ కులాలకు కులధ్రువీకరణ పత్రాలను ఆర్డీవో ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 57 ఎంబి ఎస్సీ కులాలకు ప్రత్యేక డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమం లో ఎంబి ఎస్సీ కులాల రాష్ట్ర నాయకులు ముంజాగల విజయ్ కుమార్, ఉపదే సనధన్ మాంగ్ గారోడి, కర్నె రామారావు డక్కలి, బత్తుల పాండు పంబాల, దొంబర దివాకర్, వెంకటయ్య మదాసి కురువ, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, పరమేశ్వర్ మాంగ్, కొల్పుల నవీన్, మాష్టి చిన్నస్వామి, మటపతి నాగయ్య బేడ బుడ్గ జంగం తదితరులు పాల్గొన్నారు.