Suryaa.co.in

Political News

ఓటీఎస్ స్కీమ్ గురించి సంచలన రహస్యాలు

అమాయక పేద ప్రజలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఓటీఎస్ స్కీమ్ అబద్దాలతో ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇస్తామని ప్రామిస్ చేసే ఇళ్లను డబ్బులకు
Housingఅమ్ముకోవడం మొదటి మోసం. తాజాగా తెలిసిన ఘరానా మోసం ఏంటంటే… అసలు కేంద్రం చట్టం ప్రకారం… ఇపుడు చేస్తున్న రిజిస్ట్రేషన్లు చెల్లవంట. ఈ స్కీమ్ గరించి కొన్ని సంచలన రహస్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం.
గ్రామ సచివాలయాల్లో చేసే ఒటిఎస్ రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన డాక్యుమెంట్లు చెల్లవు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం.. 3జాబితాల్లో అధికారాలు కేంద్ర, రాష్ట్ర

ప్రభుత్వాలకు విడివిడిగా, సంయుక్తంగా ఉండే అధికారాలు నిర్దేశించబడ్డాయి.కాంకరెంట్ జాబితాలోని ఐటెమ్ నెం.6 ప్రకారం వ్యవసాయేతర భూమి బదలాయింపు, రిజిస్ట్రేషన్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఈ పరిధిలోకి వస్తాయి. (transfer of property other than agriculture land, registration of deeds and documents)
ఆర్టికల్ 254 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టంలోని ఏదైనా నిబంధన.. అంతకుముందు పార్లమెంటు చేసిన చట్టంలోని నిబంధన లేదా జాబితాలోని అంశాల్లో ఒకదానికి సంబంధించి ఇప్పటికే

ఉన్న చట్టంలోని నిబంధనలకు విరుద్ధమైతే… క్లాజ్ (2) లోబడి రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం చెల్లదు.
దీని ప్రకారం ఒటిఎస్ రిజిస్ట్రేషన్లు చేసే అధికారాన్ని వార్డు, గ్రామ సెక్రటేరియట్ లకు కల్పిస్తూ 24-11-2021న జారీచేసిన జిఓ 332 చెల్లుబాటు కాదు. జగనన్న బొమ్మ వేసి రిజిస్ట్రేషన్ల పేరుతో ఇస్తున్న రంగుల డాక్యుమెంట్లు చిత్తుకాగితాలతో సమానం. వాటికి ఎటువంటి చట్టబద్దత లేదు.
– నారాయణ

LEAVE A RESPONSE