– పాలక మండలి చైర్మన్, సభ్యులను అభినందించిన మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులను రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య లు శనివారం ఉదయం దుర్గగుడిలో కలిసి వారిని అభినందించారు.
దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మ కు సేవ చేసే అవకాశం చైర్మన్ కు, సభ్యులకు కల్పించారని దానిని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం పాలక మండలి పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా భక్తులకు సేవలు అందించాలన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని మంత్రి కొలుసు పార్థసారధి చైర్మన్, సభ్యులకు తెలిపారు.