– బాబును దెబ్బకొట్టేంత గొప్పొడో నీ బాపు?
-ఇంకోసారి బాబు గురించి మాట్లాడితే నీ ఇంటిముందు ధర్నా చేస్తాం
– కేటీఆర్‌పై తెలంగాణ తెలుగుమహిళ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు షకీ లారెడ్డి ఫైర్
హైదరాబాద్: తన తండ్రి దెబ్బ ఎలా ఉంటుందో నీ గురువు చంద్రబాబును అడిగి తెలుసుకోమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ టీడీపీ తెలుగుమహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి మండిపడ్డారు. ‘ మీ కుటుంబపాలన, నియంతపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈడ్చికొడితే ఫాంహౌస్‌లో పడ్డారు. ఇప్పటిదాకా బయటకు రాలేదు. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని మీ తండ్రి మా చంద్రబాబును దెబ్బకొట్టేంత గొప్పోడా? మీకు రేవంత్‌రెడ్డికి ఏమైనా ఉంటే చూసుకోండి. మధ్యలో చంద్రబాబు ముచ్చట ఎందుకు? మా టీడీపీ నాయకులు లేకపోతే మీ టీఆర్‌ఎస్‌కు దిక్కులేదు. అది గుర్తుపెట్టుకుని మాట్లాటడం మంచింది. ఇంకా మీ అహంకారపూరిత మాటలు తగ్గించుకోకపోతే రేపు మీ పార్టీలో మీరు మీ తండ్రి, మీ చెల్లి, మీ బావ తప్ప ఎవరూ ఉండ రు’’ అని హెచ్చరించారు. చంద్రబాబు భుజం మీద రేవంత్‌రెడ్డిని పేల్చాలన్న మీ పాత టెక్నిక్‌కు కాలం చెల్లింది. ఇకనయినా మీ బుర్రను సర్ఫుతో క్లీన్ చేసుకోండి. లేకపోతే పిచ్చోళ్లయిపోతారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటింది. ఇంకా మీరు, మీ చెల్లి చంద్రబాబునాయుడు- ఆంధ్రావాళ్ల పేరుతో ఎంతకాలం బతుకుతారు? చంద్రబాబునాయుడు-ఆంధ్రా అనే పదాలు వాడకుండా మీరు, మీ పార్టీ బతకలేరా?అవి చెబితే తప్ప జనం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదా? ఆ పదాలు చెప్పి రెచ్చగొట్టకపోతే మీ దుకాణం నడవదా?’’ అని షకీలారెడ్డి విరుచుకుపడ్డారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదని, ఈరోజు ఐటిసి ట్రేడ్‌యూనియన్ ఎన్నికల్లో టీఎన్‌టియుసి విజయం సాధించడమే దానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబం దొరలపోకడ విడిచిపెట్టి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే పార్టీ మునిగిపోవడం ఖాయమన్నారు. సోషల్‌మీడియా మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన బీఆర్‌ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పెట్టిన పోల్‌ను కూడా మేనేజ్ చేసిందని, అందుకే కేసీఆర్ బయటకు వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును దెబ్బకొట్టే మొనగాడు ఇప్పటివరకూ లేరని, ఆయన మీ తండ్రిలా ఫాంహౌస్‌లా పడుకోర న్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం జనంలో ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మరోసారి చంద్రబాబునాయుడు గురించి మాట్లాడితే మీ ఇంటిముందు ధర్నా చేస్తామని షకీలారెడ్డి ెహ చ్చరించారు.