– మంత్రి లోకేష్ చొరవతో స్వదేశానికి చేరిన కడప వాసి మృతదేహం
అమరావతి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మస్కట్ లో మృతి చెందిన కడప బిస్మిల్లా నగర్ కు చెందిన యువకుడు షేక్ మహ్మద్ అనీష్ అన్సారీ మృతదేహం స్వదేశానికి చేరుకుంది. జీవనోపాధి కోసం 32 ఏళ్ల అనీష్ అన్సారీ మస్కట్ వెళ్లారు. అయితే గుండెపోటుకు గురికావడంతో ఈ నెల 18న మరణించాడు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా సాయం చేయాలని కుటుంబ సభ్యులు ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. అనీష్ అన్సారీ మృతి బాధాకరమని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లుచేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తన టీం ద్వారా అన్సారీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించారు.