Suryaa.co.in

Andhra Pradesh

ఇ-సేవా కేంద్రాన్ని ప్రారంభించిన శిద్దా సుధీర్ కుమార్,మేయర్ గంగాడ సుజాత

ఒంగోలు మంగమూరు రోడ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గుమ్మా డిజిటల్ ఇ-సేవా కేంద్రాన్ని మేయర్ సుజాత తో కలసి ప్రారంభించిన యువ పారిశ్రామిక వేత్త,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిద్దా సుధీర్ కుమార్.

ఈ సందర్భంగా శిద్దా సుధీర్ కుమార్, మేయర్ గంగాడ సుజాత ను సంస్థ యజమాని గుమ్మా హనుమంతరావు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శిద్దా సుధీర్ కుమార్,మేయర్ సుజాత రిబ్బన్ కట్ చేసి డిజిటల్ సేవా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి పూజలు నిర్వహించారు. శిద్దా
sidda1 సుధీర్ కుమార్ మాట్లాడుతూ గుమ్మా డిజిటల్ ఇ. సేవా కేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు గుమ్మా హనుమంతరావు ను అభినందించారు.డిజిటల్ ఇ. సేవా కేంద్రంలో ఆన్ లైన్ సేవలు,డిజిటల్ పేమెంట్స్,ప్రభుత్వ సేవలు,ఆధార్ ,పాన్ కార్డ్ సర్వీస్ అందుబాటులో ఉండడం అభినందనీయమని అన్నారు.

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మేయర్ సుజాత మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఏర్పాటు చేసిన గుమ్మాస్ డిజిటల్ ఇ. సేవ కేంద్రం ప్రజలందరికి ఉపయోగకరంగా ఉందని ఆధార్,సేవలు, రవాణా శాఖ సేవలు ఇక్కడ అందుబాటులో రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఆర్.టి.ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గుమ్మాస్ డిజిటల్ ఇ. సేవ కేంద్రంలో రవాణా శాఖ కు సంభందించి 80 రకాల ఆన్లైన్ సేవలు ప్రజలకు అందుబాటులో వుంటాయని అన్నారు.

డిజిటల్ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు గుమ్మా హనుమంతరావు ను ఆర్.టి.ఓ చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.అనంతరం గుమ్మా హనుమంతరావు శిద్దా సుధీర్ కుమార్,మేయర్ గంగాడ సుజాత,ఆర్.టి.ఓ చంద్రశేఖర్, ఎమ్.శివ రామ్, కరి పూర్ణ చంద్ లకు శాలువతో సత్కరించారు. ఈ
sidda2 కార్యక్రమంలో జ్యోతి గ్రానైట్ ఎక్సపోర్టు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సి.ఓ.ఓ.ఎమ్. శివరామ్,ప్రకాశం హాస్పిటల్ డా.హనుమంతరావు, రవాణా శాఖ అధికారి గంగాధర ప్రసాద్,స్నేహ ఎలక్ట్రానిక్స్ యజమాని నల్లూరి హేమంత్,వ్యాపారవేత్త కరి పూర్ణ చంద్,అయ్యప్ప,సాయి,అశోక్, రమేష్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE