ఎమ్మెల్యే టిజేఅర్ సుధాకర్ బాబు పిఏ పై సమగ్ర విచారణ చేపట్టాలి

Spread the love

-తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్

ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువత ను మోసం చేసిన సంతనూతలపాడు శాసన సభ్యులు టిజేఅర్ సుధాకర్ బాబు పి ఏ బండారు సురేష్ వ్యవహారం పై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ డిమాండ్ చేశారు.

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేని వారి పాలెం కు చెందిన నిరుద్యోగ యువత కందుల పుల్లారావు, నాగబాము అశోక్, కందుల అనీల్ ల నుండి ఆరు లక్షల యాబై వేల రూపాయలు తీసుకుని ఐ ఐ ఐ టి లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసారనీ, బాధితులు మా ఉద్యోగాలు ఏవి అని ఎమ్మెల్యే పి ఎ సురేష్ ను ఒత్తిడి చేయగా సాక్షాతూ జిల్లా కలెక్టర్ సంతకం తో నకిలీ నియామక పత్రాలు వారికి ఇచ్చారంటే, అతని వెనక వున్నా అదృశ్య శక్తి ఎవరో పోలీసులు, ప్రభుత్వ యంత్రాగం సమగ్ర విచారణ చేపట్టాలని బెజవాడ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

బాధిత యువకులు స్పందన లో ఫిర్యాదు చేశారని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారం లోకి రాగానే విడుదల చేస్తాను అని చెప్పిన జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ వుంటే, అదే అదునుగా తీసుకున్న వైకాపా నాయకులు, అనుచరులు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువత దగ్గర లక్షలు డబ్బులు దండుకుంటూ వారిని మోసం చేయడం అన్యాయం అన్నారు.

రెండు రోజుల క్రితం చీరాల కు చెందిన వైకాపా నాయకుడు, బాపట్ల ఎంపి నందిగాం సురేష్ ప్రధాన అనుచరుడు యాతం క్రాంతి కుమార్ పదిహేను మంది నిరుద్యోగ యువతను ఇదే విధంగా మోసం చేసి, వారు పిర్యాదు చేయగా విచారణ ఎదుర్కొంటున్న సమయం లో సాక్షాతూ సంతనూతల పాడు శాసన సభ్యులు టిజేఆర్ సుధాకర్ బాబు పిఏ బండారు సురేష్ ఇదే విధమైన మోసం చేయడం విస్మయం కలిగిస్తుందని అన్నారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ డిమాండ్ చేశారు.

Leave a Reply