మనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షితమైన నీతి. అసూయా ద్వేషాలు మానసిక రోగాలు, అవి మనిషి ఎదుగుదల ను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.. కొన్ని తప్పులు దొర్లినా మంచి సంబందాలను దూరం చేసుకోకూడదు.
సంబంధాలకు కావాల్సింది ఆప్యాయత కానీ పరిపూర్ణత కాదు.. మౌననికి రూపం లేకపోవచ్చు, కానీ అగ్నివలే దహించే శక్తి ఉంది. మాటకు పదును లేకపోవొచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చివేస్తుంది.. కష్టకాలాన్ని మర్చిపో అది నేర్పిన గుణపాఠల్ని గుర్తుపెట్టుకో.. ఎవరు ఎంత హేళన చేసిన నీవు తొందరపడకు.
హేళన చేసినవారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది… బలం ఉపయోగించి ఎదుటివారి మీది గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం.. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని చాలా మారుస్తాయి.. కొందరిని మౌనంగాను మరికొందరిని కఠినంగాను.. జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకో సరిగ్గా తిని తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగ్గా విని వినకపోతే మనస్పర్థలు వస్తాయి.