పాటలీ పుత్రమ్ము కోట కొమ్మల మీద
తెలుగు జండాలు నర్తించు నాడు
ఢి ల్లీసు నెదిరి జెండిన తెలుగు విలుకాండ్రు
నవలక్ష లోరుగల్ గలియు నాడు
రాచూరు కదన మందేచి తళ్ తళ్ మంచు
తెలుగు జోదుల కత్తి తిరుగునాడు
అల చో ళ పాండ్య భూముల తెల్గుసర్కార్ల
పసు పు సూయాణమై ప్రాకు నాడు
చూచి సంతోష భారంబు మోచి శిరము
నూచు భాగ్యంబు నకు నింత నోచ లేక
ఏల పుట్టితిని పుడి సీ! ఏటీ బ్రతుకు ?
కట కటా దాటి పోయె బంగారు యుగము . ..
– తుమ్మల సీతారామమూర్తి చౌదరి .
– జి వి రామ్ ప్రసాద్ ,విజయవాడ