ఏపీలో రైతులకు మిగిలింది చివరకు గోచిపాతే

-అన్నపూర్ణ లాంటి ఏపీలో వ్యవసాయ శాఖనే మూసేస్తారా
-పంట వేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది
-రైతులను ఇంతగా కష్టపెడుతున్నందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి
– మనుబోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి,పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు: జగన్మోహన్‌రెడ్డి పాలనలో రైతు పరిస్థితి చివరకు గోచీ కూడా అమ్ముకునే దుస్థితికి చేరాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబూలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

సోమిరెడ్డి ఏమన్నారంటే.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనిలా రాష్ట్రంలోని రైతన్నల పరిస్థితి. ప్రాజెక్టుల నిండా నీరు ఉన్నా పంటలు సాగు చేయలేని దుస్థితి. రైతులను కష్టాలపాలు చేసిన సీఎం జగన్మోహన్
somireddy1రెడ్డికి నిద్ర ఎలా పడుతుందో. చివరికి రాష్ట్రంలో రైతన్నలకు గోచిపాత మాత్రమే మిగిల్చారు.రైతులను ఆదుకోవాలని సీఎంని అడిగే దమ్ము ఎమ్మెల్యేలకు,మంత్రులకు లేదు. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలు అమలు కాకపోతే పరువు పోతుందని సీఎంకు చెప్పే ధైర్యం కూడా వారికి లేదు. రాష్ట్రంలో రైతులను కష్టాలు పాలు చేసేందుకు సిగ్గుండాలి.

అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయ శాఖనే మూసేస్తారా? రైతుల కోసం కేంద్రం అందిస్తున్న పథకాలను ఆపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రైతు కుటుంబాల్లో పుట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రోడ్డు పైకి రావాలి. 2017- 18 సంవత్సరంలో బిందు తుంపర్ల సేద్యంలో ఏపీ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచింది.

ఈరోజు 0.00 శాతంకు పడిపోయింది…ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. దేశమంతా అమలయ్యే మైక్రో ఇరిగేషన్ ను ఇక్కడ మూసి వేస్తారా? వరి సేద్యం చేయాలంటేనే రాష్ట్రంలో రైతులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుట్టు ధాన్యం అంటే 850 కిలోలకు బదులుగా 1050 అన్న చందంగా మారింది. ఇదేమని ప్రశ్నిస్తే 1150 కిలోలు దోచుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన డి ఏ పి, పొటాషియం, జీలుగలు వంటి వాటి ధరలను 300 శాతానికి పైగా పెంచేశారు.

పురుగు మందుల పరిస్థితి అదే విధంగా మారింది..విత్తనాలు పోస్తే మొలిచే పరిస్థితి లేకుండా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు అన్ని సబ్సిడీలు అందజేశాం. ఎరువులు, పురుగు మందులతో పాటు యాంత్రీకరణలను సబ్సిడీ లకి అందించి అన్నదాతలకు అండగా నిలిచారు. నేడు ఏది కనపడని పరిస్థితి.

2015లో భారీ వరదలు వస్తే మనుబోలు మండలం లో బాధితుల ప్రతి ఇంటికి 4000 అందజేశాం. ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 9000, మగ్గాలు దెబ్బతిన్న వారికి 12000 తక్షణ సహాయం కింద అందించాం. నేడు వరదలు వస్తే కనీసం బాధితులకు దిక్కుందా. వరదలు వచ్చి పదిహేను రోజులపాటు ఇళ్లలోనే బాధితులు ఉంటే ఒక్క రూపాయి అందించారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ డిజాస్టర్ మేనేజ్మెంట్ పని చేయలేనిదానికి ప్రభుత్వం ఎందుకు? ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ముక్కు పిండి పన్నులు వసూళ్లు చేయడం… వ్యవస్థలను మూసివేయడం తప్ప చేసిందేమీ లేదు.

Leave a Reply