రైతులను నిలువునా ముంచేసిన వైసీపీ ప్రభుత్వం

– ప్రకృతి వైపరీత్యాల బాధితులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం
– రైతుల కోసం దేశమంతా అమలయ్యే పథకాలను ఏపీలో మాత్రమే ఆపివేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
కేసీఆర్ నుంచి చూసి కాపీ కొట్టాల్సింది ఫెయిలైపోయిన జిల్లాల పెంపును కాదు..రైతులకు ఎంతగానో అండగా నిలుస్తున్న రైతు బంధు పథకాన్ని
– అనంతపురంలో కరువు, తుపాను బాధితుల రణభేరిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడింది. కరువు, తుపాన్ల లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ఉదారం ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్డీఆర్ఎఫ్ నిర్దేశిత ప్రమాణాలకు మించి రైతులకు నష్టపరిహారం మంజూరు చేసిన ఘనత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుంది.

ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా పరిహారాన్ని భారీగా పెంచాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్ని పరిహారాల మొత్తాన్ని తగ్గించేశారు. వరికి హెక్టారుకు రూ.13500 పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతుంటే మా ప్రభుత్వం రూ.20 వేలు చెల్లించింది. ఆ
somireddy1 సమయంలో రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగనే ఆ మొత్తాన్ని రూ.15 వేలకు తగ్గించారు.ఒక్క వరి విషయంలోనే కాదు…కొబ్బరి, జీడిమామిడి, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటలతో పాటు ఫౌల్ట్రీ విషయంలోనూ పరిహారం తగ్గించి రైతులను చావుదెబ్బ కొట్టారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీగా రూ.3300 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే పెంచి ఇచ్చాం..కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నవంబర్ లో సంభవించిన వరదలకు నెల్లూరులో ఒక్క ఆక్వా రంగానికే 2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

ముదివర్తిపాళెం, గంగపట్నం ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన పరిహారం రూ.75 లక్షలు మాత్రమే. వ్యవసాయ రంగానికి 2019-20లో బడ్జెట్ లో రూ18130 కోట్లు కేటాయించి ఖర్చుపెట్టింది రూ.6929 కోట్లు మాత్రమే. 2020-21 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 20 వేల కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 7 వేల కోట్లే.

ఇరిగేషన్ రంగానికి 2019-20లో 11,193 కోట్లు కేటాయించి ఖర్చుచేసింది 3659 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వ పనితీరుకి, రైతులపై చూపుతున్న చిన్నచూపునకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఏపీలో 65 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి..ప్రతి కుటుంబానికి రూ.12500 చొప్పున రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక రైతు భరోసా మొత్తాన్ని, రూ.7500కి రైతు కుటుంబాల సంఖ్యను 45 లక్షలకు తగ్గించి దగా చేశారు. కేసీఆర్ ను చూసి కాపీ కొట్టాల్సింది ఫెయిలైపోయిన జిల్లాల పెంపును కాదు..రైతులను ఆదుకునే రైతు బంధు లాంటి పథకాలను కాపీ కొట్టండి. రైతుకు ఎన్ని ఎకరాలున్నా ఎకరాకు రూ.10 వేలు ఇచ్చే రైతు బంధు పథకాన్ని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను ఏపీలోనూ చేయండి.

వ్యవసాయానికి మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు..మీరేమో ఇక్కడ మీటర్లు బిగించుకుంటూ పోతున్నారు. రూ.6 వేలకు లభించే మీటరును రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మీటర్ల రూపంలో లక్షల కోట్ల భారం అవసరమా?

కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చుకోవడం కోసం రైతుల నడ్డి విరగ్గొడుతారా టీడీపీ హయాంలో ప్రతి రైతు భూమిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలకు అనుగుణంగా సూక్ష్మపోషకాలను ఉచితంగా అందజేశాం.

ఈ రోజు భూసార పరీక్షలు లేవు,.సూక్ష్మ పోషకాలూ లేవు..పూర్తి ఉచితంగా కాకపోయినా కనీసం 50 శాతం సబ్సిడీతో అయినా ఇచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ శాఖ మంత్రికి సేద్యంపై కొంచెం అవగాహన ఉన్నా ఈ రంగాన్ని ఇంతలా నిర్లక్ష్యం చేయరు. ఇరిగేషన్ మంత్రికి నీటిపారుదలపై అవగాహన లేని పరిస్థితి..ఇలాంటి మంత్రులను పెట్టుకుని రైతులకు అన్యాయం చేస్తారా?

తెలంగాణలో రైతుల వద్ద కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఏపీలో కనీస మద్దతు ధరకు కొనకపోగా రెండు, మూడు నెలలకు కూడా రైతులకు నగదు చెల్లించని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.

మా నెల్లూరులో అయితే దళారులు, వైసీపీ నాయకులు కలిసి ధాన్యం కొలత స్థానిక ప్రామాణికమైన పుట్టికి అర్థం మార్చేసి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. తరతరాలుగా పుట్టి అంటే 850 కిలోలు అని వస్తుండగా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పుట్టికి 1150 కిలోల వరకు గుంజుకుంటూ రైతులకు వందల కోట్ల నష్టం చేస్తున్నారు.

32 నెలల వైసీపీ పాలనలో రైతులను నిలువునా ముంచేశారు..ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగినంత మోసం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. రాయలసీమకు వరప్రదాయిని అయిన బిందు తుంపర్ల సేద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90 శాతం సబ్సిడీతో బిందు తుంపర్ల సేద్యాన్ని ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఏపీని అగ్రగామిగా నిలిపాం.

ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కూడా పూర్తిగా పడుకోబెట్టేశారు..రైతులకు స్ప్రేయర్లు కూడా దొరకని దుస్థితి. రైతుల కోసం దేశమంతా అమలయ్యే పథకాలను ఏపీలో ఆపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నాయకులు నారాయణ, రామక్రిష్ణ, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, రైతు సంఘాల నాయకులు

Leave a Reply