– నిన్ను తిట్టాలని జగన్ నన్ను రెండురోజులు ఒత్తిడి చే శారు
– నేను ముందు ఒప్పుకోనందుకే సుబ్బారెడ్డితో తిట్టించారు
– నాకు తర్వాత తిట్టక తప్పలేదు
– తప్పయింది.. అవి మనసులో పెట్టుకోవద్దు
– ైవె సీపీ ఎంపీలను బీజేపీలో చేర్పించాలని ఢిల్లీ నేతలు ఆదేశించారు
– ఢిల్లీ ప్రతిపాదనకు జగన్ ఒప్పుకోలేదు
– అప్పుడు నాకూ,బాబుకు తేడా ఏముంటుంది అన్నారు
– పియూష్ గోయల్ నన్ను రాజీనామా చేయమని చెప్పారు
– అందుకే రాజీనామా చేశా
– జగన్ వద్దని నన్ను వారించారు
– ఇద్దరం కలిసే హిమాలయాలకు వెళదామన్నారు
– తారకరత్న భార్యతో కలసి షర్మిలతూ భేటీ అయిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
– ‘మహానాడు’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిన్ను తిట్టమంటేనే తిట్టాల్సివచ్చింది. జగన్ ఆస్తులతో నీకెలాంటి సంబంధం లేదు. అవి జగన్ కష్టారిజ్జతమని మీడియాకు చెప్పాల్సివచ్చింది. అప్పటి పరిస్థితి అది. తప్పలేదు. అప్పటికీ నేను రెండురోజులు నీ గురించి మాట్లాకపోతేనే సుబ్బారెడ్డితో నిన్ను తిట్టించారు. మూడవరోజు నాకు తప్పలేదు. సారీ పాపా’’ ఇదీ.. ఏపీసీసీ చీఫ్, జగన్ చెల్లెలు షర్మిలారెడ్డితో.. ైవె సీపీ మాజీ ఎంపి వే ణుంబాక విజయసాయిరెడ్డి భేటీ సారాంశం.
సినీనటుడు, దివంగత తారకరత్న భార్య అలేఖ్యారెడ్డితో కలసి.. లోటస్‌పాండ్‌కు వెళ్లిన విజయసాయి, ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. షర్మిలను వైఎస్ కుటుంబసభ్యులు, సన్నిహితులు పాప అని సంబోధిస్తుంటారని తెలిసిందే. ఆ సందర్భంగా వైసీపీలో ఉన్నప్పుడు షర్మిలను నానామాటలు అన్నందుకు సాయిరెడ్డి ఆమెకు సారీ చెప్పారన్నది కాంగ్రెస్ వర్గాల కథనం.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. షర్మిల వద్దకు తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లిన విజయసాయిరెడ్డి.. గతంలో షర్మిల ఆస్తులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించి, సారీ చెర్పారట. తన ఆస్తులతో నీకు సంబంధం లేదని జగన్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పమని రెండురోజులు తనను పిలిచి మరీ ఒత్తిడి చేశారని, ముందు తాను స్పందించకపోవడంతో, సుబ్బారెడ్డిని పిలిచి నిన్ను తిట్టమని చెప్పార ని షర్మిలకు సాయిరెడ్డి వివరించారట. ఆ తర్వాత తాను ఆస్తులపై స్పందించి, విమర్శించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే మీ కుటుంబవిధేయుడిగా మీ ఆస్తులపై మాట్లాడాల్సి రావడం నాకు బాధగానే ఉందని, ఆ విషయంలో మిమ్మల్ని మనస్థాపానికి గురిచేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు షర్మిలకు వివరణ ఇచ్చుకున్నారట.
ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీలోఒక అగ్రనేత.. పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్పించమని తన ద్వారా జగన్‌కు సందేశం పంపించారట. ఆ ప్రతిపాదనకు జగన్ ఒప్పుకోలేదు. అలా చేస్తే నాకూ చంద్రబాబుకూ తేడా ఏముంటుందని జగన్ ప్రశ్నించారని షర్మిలకు సాయిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత తనను వెళ్లి పియూష్‌గోయల్‌ను కలవమన్నారని, ఆయన తనను రాజీనామా చేయమని చెప్పిన తర్వాతనే వైసీపీకి రాజీనామా చేశానని షర్మిలకు, సాయిరెడ్డి వివరించారట. తాను పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం జగన్‌కు చెప్పిన ప్పుడు ఆయన ఒప్పుకోలేదని, ఇద్దరం కలిసే హిమాలయాలకు వెళదామని వ్యాఖ్యానించారట.
కాగా జగన్ ఒత్తిడి చేసినందుకే తనపై విమర్శలు చేశానని చెప్పిన విజయసాయిరెడ్డిని.. ‘‘ఆ విషయాన్ని మీరు ఇప్పుడు మీడియాకు చెప్పవచ్చు కదా? మీరు ఏ పార్టీలో లేనందున అలా చెప్పడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కదా? పైగా ఆ ఆస్తులన్నీ జగన్‌వే అనుకుంటున్న వారికి మీ సమాధానం వల్ల స్పష్టత వస్తుంది కదా’’ అని షర్మిల కోరినప్పుడు.. సాయిరెడ్డి మౌనం వహించినట్లు సమాచారం.