Suryaa.co.in

Telangana

స్పీకర్ గారూ.. షర్మిలపై చర్యలు తీసుకోండి

– పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఫిర్యాదు
-విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ

వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. గౌరవ శాసన సభ్యులపై రాజకీయ నాయకులు కానీ,ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అసభ్య పదజాలంతో దూషించినా,అగౌరవ పర్చినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన శాసన సభ్యులు అల్ల వెంకటేశ్వర్ రెడ్డి, కాలే యాదయ్య, సి.లక్ష్మారెడ్డి.

శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్ లో సభాపతి పోచారం గారిని కలిసిన శాసనసభ్యులు ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో వైయస్ షర్మిల శాసన సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,అసభ్య పదజాలంతో దూషిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

గౌరవ శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గా నాపై ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని అన్ని కోణాల్లో విచారణ చేసి బాద్యులపై తగిన చర్యలు తీసుకుంటానని శాసన సభ్యులకు స్పీకర్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE