– వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రధాని ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం మూడోసారి వీర్ బాల్ దివస్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 2022లో తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మోదీ ఆదేశాల మేరకు తొలిసారిగా తాను వీర్ బాల్ దివస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించానన్నారు. మూడోసారి ప్రతీ జిల్లాలు,పాఠశాలల్లో ఈ వీర్ బాల్ దివస్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలందాయన్నారు.
ఈ దివస్ ను పాఠ్య పుస్తకాల్లో సిలబస్ లాగా పెట్టాలని డిమాండ్లు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. తప్పకుండా సిలబస్ లో వీర్ బాల్ దివస్ ను పాఠ్యాంశాల్లో పెట్టడంపై స్వయంగా ప్రధాని మోదీతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
350 యేళ్ల క్రితం వీర్ సాహెబ్ బలిదానం డిసెంబర్ 26 రోజే జరిగిందన్నారు. భారత్ ధర్మాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు గురు గోవింద్ సింగ్ ఆదేశానుసారం బలిదానం చేశారన్నారు. బలిదానం చేసిన వారు కేవలం భారత బిడ్డలున్నారు. వీరి బలిదానాలను బీజేపీ నమస్సులు చేస్తుందన్నారు.
ఇలాంటి వీర పుత్రులను జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకు కూడా శిరస్సువంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశం కోసం బలిదానాలు చేసిన ప్రతీ ఒక్కరికి నమస్కరిస్తున్నానన్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ వీరి బలిదానాల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రానున్న సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రతీ గ్రామంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. బలిదానాల దినోత్సవాన్ని కూడా పేరు మార్చాలనే డిమాండ్ ఉందన్నారు. దీనిపై కూడా చర్యలు చేపడతామన్నారు. వీర్ బాల్ దివస్ పేరు మార్పుపై కూడా ప్రధానమంత్రి మోదీకి వివరిస్తానన్నారు. పాఠ్యాంశాల్లో ఈ అంశం ఉండటం అత్యంత ఆవశ్యకమన్నారు. చరిత్రను బోధించాల్సిన అవసరం ఉందన్నారు. వీర్ బాల్ దివస్ లో బలిదానాలను యువతకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వస్తున్నారని తెలిపారు. సిక్కు సోదరుల డిమాండ్ మేరకు సికింద్రాబాద్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలనే డిమాండ్ పై అందరం కలిసి మంత్రితో చర్చిద్దామన్నారు. ఈ విషయంలో తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బల్ దేవ్ సింగ్, బగ్గా సింగ్, గురుదేవ్ సింగ్, బగేందర్ సింగ్, హరిసింగ్, చంద్రశేఖర్, రాంచందర్, గౌతమ్ రావు, ప్రేమేందర్, డా. శిల్పారెడ్డి, జయశ్రీ, హర్విందర్, మధుసూదన్, కొండేటి లాంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.