-ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో విషం లేదని ప్రజలకు నిరూపించుకోలేక.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై విషపు ప్రచారం చేస్తున్నారు
-ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో విష పదార్థాలు లేవని చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ పెద్దలకు లేదు
-తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో విషం లేదని ప్రజలకు నిరూపించుకోలేక.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై విషపు ప్రచారం చేస్తున్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…
ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో విష పదార్థాలున్నాయని గత వారం రోజులుగా టీడీపీ మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. దీన్ని బట్టి ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని నమ్ముతున్నారా లేక ఒప్పుకుంటున్నారా? ఇందులో విష పదార్థాలు లేవని చెప్పగలిగే నాయకుడు వైసీపీలో లేరు. వైసిపీల బినామీలకు చెందిన ఈ డిస్టలరీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో విష పదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులలో తేలింది. ఈ కల్తీ మద్యం తాగొద్దు అని ప్రజలను చైతన్యవంతులను చేస్తుంటే అడ్డు తగులుతున్నారు. సిల్వర్ స్ట్రైప్స్, 9సిహార్సెసెస్, ఆంధ్రగోల్డు విస్కిలలో ఎస్ జియస్ ల్యాబ్ రిపోర్టు ప్రకారం పెరోగెలాల్, ఐసోఫ్యూరిక్ యాసిడ్ లాంటి విషపు పదార్ధాలు ఉన్నాయని టీడీపీకిచెందినవారు ల్యాబ్ కు శాంపిల్స్ పంపి పరీక్షించి నిరూపించారు. ఈ మద్యం సేవించడంవల్ల లివర్లు చెడిపోయి, కిడ్నిలు పాడై ఎందుకు చనిపోతున్నారో వాళ్లకే తెలియడంలేదు. అనేక మంది మందుబాబులు మృత్యువాత పడుతున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రతి పక్ష హోదాలో చంద్రబాబు నాయుడు స్వయంగా రిసెర్చ్ చేయించి ప్రజలకు తెలియపరుస్తున్నారు. వీటి గురించి ప్రజలకు తెలియపరచండి అంటే కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వంలోని ప్రధాన కార్యదర్శులు, సలహాల దారులు కూడ అబద్ధాలు వెళ్లగక్కుతున్నారు. వీరి వద్ద సమాధానం లేక మాపైన్నే విష ప్రచారాలు చేస్తున్నారు.
డిస్లరీలు అన్ని చంద్రబాబు నాయుడు హాయాంలోనివే అని చెప్తున్నారు. అదాన్ డిస్లరీ ఎప్పుడు వచ్చింది? ఎస్.పి.వై డిస్లరీకి, ఎస్.ఎన్.జి కి సంబంధించిన మేనిజింగ్ డైరెక్టరు ఎవరు?, ఎమ్మెస్ బయోటిక్, జేఆర్ఎస్ అసోసియేట్స్ ఎప్పుడు ఏ చిరునామాతో మొదలు అయ్యాయని మేం అడుగుతుంటే వీటన్నిటికి సమాధానం చెప్పలేక డిస్లరీలు అన్ని చంద్రబాబు నాయుడు గారి హాయాంలోవే అని తోసిపుచ్చుతున్నారు. డిస్లీరీలు అన్ని చంద్రబాబు నాయుడు హయాంలో వస్తే ఇప్పుడు వస్తున్న బ్రాండ్లు మాత్రం చంద్రబాబు నాయుడు హయాంలోనివి కావు… పసుపు రంగు బట్టలు వేసుకొని వెలుతుంటేనే పోలీసులు ఆపి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తివి అని వెళ్లనివ్వకుండా ఆపేస్తే ఆ వ్యక్తి ఉద్యోగి గుర్తింపు కార్డు చూపించి పార్టీ వ్యక్తి కాదని నిరూపించుకుంటేనే వదిలిపెట్టారు. అలాంటి మీరు చంద్రబాబు నాయుడు హయాంలోని డిస్లరీలని కొనసాగిస్తున్నారా? తెలుగుదేశం పార్టీకీ సంబంధించిన మనిషి అంటే ఆఖరికి ముసలి వాళ్ళకి కూడ పెన్షన్ , ఆసరా, అమ్మఒడి ఇవ్వరు… పసుపు చొక్కా చూస్తేనే మీకు శరీరంపై తేళ్లు, జెర్రులు పాకినట్లుంటి. అలాంటిది చంద్రబాబునాయుడు హయాంలోని డిస్టరీలను కొనసాగిస్తున్నారంటే ప్రజలు నమ్మతారా? నిజంగా ఈ బ్రాండ్లలలో విషపూరిత పదార్థాలు లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించిన తరువాత నుంచి మద్యం దుకాణాలలో ఆ బ్రాండ్లను ఎందకు మాయం చేశారు, ఎక్కడ కనిపించకుండా పక్కన పెట్టేశారు. ఎందుకు అమ్మకాలు చేయడంలేదు? దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ పెద్దలకు లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన మద్యం ఇంటర్నేషనల్ బ్రాండ్లు. అవి ఎక్కడైనా లభిస్తాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా లభిస్తాయి. బందరులో లడ్డూ ఫేమస్, ఆత్రేయపురం పేతరేకులు పలుచోట్ల ఫేమస్, మాడుగుల హల్వా ఫేమస్ ఏరియాలున్నట్లు జగన్ బ్రాండ్లు ఏపీలో మాత్రమే ఫేమసా? జగన్ హయాంలో తయారు అయిన బ్రాండ్లు ఎక్కడ ఎందుకు కనిపించడంలేదు, ఆఖరికి పక్క రాష్ట్రమయిన తెలంగాణలో కూడ ఎందుకు ఆ బ్రాండ్లు లభ్యంకావడం లేదు.
బేవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో 100 కంపెనీలు రిజిష్టరు అవ్వలేదు, కేవలం 16 కంపెనీల రిజిష్టరు అయ్యాయి వాటికి మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నాం అంటున్నారు. కానీ బేవరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ టి ఐ లిస్టులో సుమారు 100 కంపెనీలు ఉన్నాయని చెప్పారు. ఇది మీరు గతంలో తీసుకొచ్చిన అమరావతి ముంపు ప్రాంతం, చిన్న వర్షానికే మునిగిపోతుంది, రాజధానిగా కొనసాగించలేము అని ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారు. ఆర్టియే యాక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టు. ఇది విషం అని చెప్తున్నా మళ్ళీ ల్యాబ్ టెస్టులు ఎందుకు చేయించడం లేదు? ఎంక్వేరి ఎందుకు చేయిచడం లేదు. ఏ సంబంధం లేని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు?. మీరు పోస్తున్న విషం గురించి, తయారు చేసే కంపెనీల గురించి అడుగుతుంటే వాటి గురించి ఎందుకు సమాధానం చెప్పడంలేదు. టీడీపీ విషపు మాటలు మాట్లాడుతున్నారు, విషం కక్కుతున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బరితెగించి మాట్లాడుతున్నారని నిందిస్తున్నారు. 2024 సంవత్సరం నాటికి దశలు వారిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ రెడ్డి మందు తాగే తాగుబోతుల్ని కూడ 15 ఏళ్ళకి తాకట్టు పెట్టి రూ.35వేల కోట్ల అప్పు తెచ్చారు. రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం ఏదైనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాడానికి కూడ వీలు లేకుండా 15 ఏళ్ళకి తాకట్టు పెట్టాడు జగన్ రెడ్డి. ఈ నకిలీ మద్యం తాగి ఏ కుటుంబం రోడ్డున పడకూడదు, ఏ మహిళ తాళిబొట్టు తెగకూడదు. అందుకోసం ఎంత దూరం అయిన వెళతాం, పోరాడతాం. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిస్లరీలన్ని మూసేయాలి, ఈ నకిలీ బ్రాండ్లన్నింటిని క్లోజ్ చేయాలి. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏం మాట్లాడించినా ప్రజలు నమ్మరు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.