Suryaa.co.in

Andhra Pradesh

యానాదుల కాలనీలో నిత్యవసరాల కిట్టును పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య

జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వారికి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు రకాల సరుకులను అందించే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో కాకాని నగర్ యానాదుల కాలనీ వారికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు నిత్యవసరాల సరుకుల కిట్లను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు సామినేని మనోహర్, పేరం సైదేశ్వర రావు మరియు కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE