Suryaa.co.in

Andhra Pradesh

బాధితులకు ఎమ్మెల్యే తాతయ్య వరద సాయం

జగ్గయ్యపేట: బలుసుపాడు, తక్కెళ్ళపాడు గ్రామాలలో వరద బాధితులకు నిత్యవసరాల సరుకులను స్థానిక నేతలతో కలిసి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య బాధితులకు అందించారు. జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కానూరి కిషోర్, తక్కెళ్ళపాడు గ్రామ సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు, బలుసుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పసుల నరసింహారావు, తక్కెళ్ళపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వసురాం, బలుసుపాడు మాజీ సర్పంచ్ చల్ల వరమ్మ, వల్లెపు శ్రీను మరియు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE