స్టాలిన్ ఆలోచన అనుసరణీయం

బ్రిటిష్ వారు భారతదేశాన్ని 1757 నుండి 1947 వరకు… 190 సంవత్సరాలు పరిపాలించారు.
1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత… భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళపాటు… భారతీయ, ప్రాంతీయ పాలకులు బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత… వంద సంవత్సరాల పాటు 1857 నుండి 1947 వరకు…. దాదాపు ఎలాంటి రాజకీయ ప్రతిఘటన లేకుండా బ్రిటిష్ పాలన సాగింది.
ఒక రకంగా చెప్పాలంటే… వందేళ్ల పాటు… భారతీయులే బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి దేశాన్ని వదిలేశారు.
చివరికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, బలహీనపడిన బ్రిటిష్ వారు… తమకు తామే ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు.
అంటే…. సోనియా గాంధీ ఇవ్వాలి అనుకున్నప్పుడు… తెలంగాణ వచ్చినట్టు… బ్రిటిష్ వాళ్ళు వెళ్లాలనుకున్నప్పుడు… మనకు స్వాతంత్రం వచ్చింది.

మళ్లీ 2014 తర్వాత…. ఢిల్లీ పీఠాన్ని…. రాజకీయ పార్టీలే బీజేపీకి వదిలేసినట్లు కనిపిస్తుంది.
ఈ పాపంలో ప్రధాన పాత్రధారి రాహుల్ గాంధీ.
56 సంవత్సరాల పాటు స్వతంత్ర భారత దేశాన్ని పాలించిన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో, రాహుల్ గాంధీ పలాయనవాదం… బీజేపీకి వరంగా మారింది.
1989లో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం… 2014 నాటికి క్లైమాక్స్ చేరింది.

ఒకవైపు కాంగ్రెస్ అస్త్రసన్యాసం….మరోవైపు ప్రాంతీయ పార్టీల లో ఉద్దండులైన శరత్ పవార్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, మొన్నటి వరకు కరుణానిధి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, దేవగౌడ మొదలైనవారు జాతీయస్థాయి రాజకీయాలను ప్రభావితం చేయటంలో బలహీన పడటం వలన……… జాతీయ రాజకీయ క్షేత్రం మొత్తం బీజేపీ పరమైంది.

స్థానికంగా సర్దుకోవడానికే మమతా బెనర్జీ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.
జాతీయ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్నట్టు నవీన్ పట్నాయక్ బతుకుతున్నాడు.
కొన్నాళ్ల పాటు జాతీయ రాజకీయాల గురించి ప్రకటనలు తప్ప…. ప్రత్యామ్నాయ కార్యాచరణకు సిద్ధంగా లేని స్టాలిన్.ఇష్టం లేకపోయినా బిజెపితోనే కాపురం చేస్తున్న నితీష్ కుమార్.

స్థూలంగా…గత ఎడున్నర సంవత్సరాలుగా…సమరం చేయాల్సిన వాళ్లు కూడా… సామూహిక సన్యాసం చేసిన కారణంగా… దేశ రాజకీయాల్లో బీజేపీ వెలిగిపోతుంది.ఈ నేపథ్యంలో స్టాలిన్ ఆలోచనను….యుద్ధ ప్రాతిపదికన ఆచరణలోకి తీసుకురావాలి.భారత రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి బతకాలంటే….ఇది ఒక చారిత్రాత్మక అవసరం.

కొలికపూడి శ్రీనివాసరావు.