– పారిశ్రామిక ప్రమాదాలపై టిడిపి రాజకీయాలు చేస్తుంది.
– చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో దళితులను మోసగించాడు
– చంద్రబాబుకు అవకాశం దొరికితే ఆర్టీసీని తుక్కు కింద అమ్మేదామని చూశాడు
– ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును రెట్టింపు చేయడమే లక్ష్యంగా ‘మిల్లెట్స్ మిషన్’కు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పంట రుణాలు, కొనుగోలు, పంపిణీ బాధ్యతలన్నీ ప్రభుత్వామే చేపడుతుందని వెల్లడించారు. కొనుగోలు చేసిన చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయ్యనుందని ఆయన చెప్పారు.
పారిశ్రామిక ప్రమాదాలపై కూడా ‘పేలాలు’ ఏరుకోవడం ఏంటి అని మాజి మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు షూటింగ్ సరదా కారణంగా 30 మంది అమాయకులు చనిపోతే ఎంత మంది మంత్రులు పరిగెత్తుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. మృతుల్లో ఉత్తరాంధ్ర భక్తులే ఎక్కువగా ఉన్నరన్న ఆయన ఆ టైంలో నీవు ఏ రాచకార్యాల్లో మునిగావు, ఇప్పుడు నీతులు చెబుతున్నావు అంటూ అయ్యన్న పాత్రుడుపై మండిపడ్డారు.
అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రాఫిక్స్ లో చూపారని ఆయన అన్నారు.25 ఎకరాల భూమి కేటాయించినట్టు చెప్పాడన్నారు. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదని, విగ్రహ నిర్మాణానికి ఇటుక కూడా వేయలేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో దళితులను మోసగించాడు తుప్పు అని వెల్లడించారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా అవకాశం దొరికితే ఆర్టీసీని తుక్కు కింద అమ్మేద్దామని చూశాడే తప్ప ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 998 అద్దె బస్సులు, 1,150 బస్సుల ఆధునికీకరణ, దశలవారీగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి సురక్షిత, సుఖమయ ప్రయాణంగా మారుస్తున్నారని ఆయన కొనియాడారు.
విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ కేంద్రాలు దిగుమతి చేసుకునే బొగ్గు ధర టన్నుకు 500% పెరిగి రూ.24,450కి చేరిందని వెల్లడించారు. 2019 మేలో దీని ధర రూ.3,428 ఉండేది. ఏటా 9 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి అవుతోందని చెప్పారు. కరెంటు ధరలు పెరగటానికి ఇదే ప్రధాన కారణమన్న ఆయన బొగ్గు ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించేదాకా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై చంద్రబాబు వందల కోట్ల కమిషన్లు దండుకున్నాడని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలోని కుడ్గి ఎన్.టి.పి.సి యూనిట్ రూ3.58కు ఇస్తామని చెప్పినా ప్రైవేటు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని యూనిట్ రూ.4.84కు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యుత్తుఛార్జీలు ఎలా పెంచుతారని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు.