జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై హత్యా ప్రయత్నం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ

నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో నిజనిర్ధారణ కొరకు అడిషనల్ ఎస్పీ అధికారి చేత విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
-ఈ నెల 29 లోపల నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆదేశాలు
2019 లో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసు లో నిందితులను కాపాడటంలో పోలీసుల పాత్ర పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ.హత్యాయత్నం కేసును పూర్తిగా నిర్వీర్యం చేసి, భారీ అవినీతికి పాల్పడిన జిల్లా SP సిద్దార్డ్ కౌసిల్ మరియు విచారణాధికారి టి.అశోకవర్ధన్ రెడ్డి లపై చట్టపరమైన చర్యలు కొరకు అభ్యర్ధన.
ప్రకాశం జిల్లా వేటపాలెం నకు చెందిన 2019 సెప్టెంబర్ 23 న జరిగిన హత్యాయత్నం FIR NO. 133/2019 చిన్నగంజాం పోలీస్ స్టేషన్ కేసులో విచారణ జరిగిన తీరుపై పలు అనుమానాలు ఊన్నాయనీ, ఈకేసు సంబంధించి జరిగిన హత్యా ప్రయత్నం వెనుక, ప్రధాన కుట్రదారులు మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్, ఇంకొల్లు CI రాజోలు రాంబాబు, ముద్దాయిలు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాస రావు @ స్వాములు మరియు వారి రక్తబంధీకులును సదరు కేసు నుండి తొలగించడం ద్వారా అసలు నేరస్తులను కాపాడి, ఈ హత్యాయత్నం కేసును పూర్తిగా నిర్వీర్యం చేసి, భారీ అవినీతికి పాల్పడిన జిల్లా SP సిద్దార్డ్ కౌసిల్ మరియు విచారణాధికారి టి.అశోకవర్ధన్ రెడ్డి లపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ కేసును పున:ర్విచారణజరిపి, ప్రధాన కుట్రదారులపై, ప్రధాన ముద్దాయిలపై కేసు నమోదు చేసి, రక్షణ కల్పించేవిధంగా తగు చర్యలు గైకొని న్యాయం చేయవలసినదిగా కోరుతూ తేది.15.11.2021 న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ వారికి జర్నలిస్ట్ నాయుడు నాగార్జున రెడ్డి చేసిన ఫిర్యాదు పై కమీషన్ స్పందించింది.
నాగార్జునరెడ్డి ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమీషన్, HRC NO.838 OF 2021 కేసు నమోదు చేసి, నాగార్జున రెడ్డి పై జరిగిన హత్యా ప్రయత్నం కేసులో పోలీస్ లు వ్యవహరించిన తీరుపై, బాధితుడి ఆరోపణలను విశ్వాసంలోనికి తీసుకుని సదరు కేసులో వాస్తవాలను గ్రహించడానికిగాను, నిజనిర్ధారణ కొరకు అడిషనల్ ఎస్పీ అధికారి చేత విచారణ జరిపించాలని, ఈ నెల 29 లోపల నివేదిక సమర్పించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.సదరు జిల్లా ఎస్పీ ఇచ్చే నివేదిక ఈ కేసులో కమీషన్ సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు కమీషన్ అభిప్రాయపడింది.