Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడం లేదు: జీవీఎల్

రాష్టంలో రైల్వే ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్లే కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. శుక్రవారం ఆయన గుంటూరు డీఆర్‌ఎం మోహన్‌రాజు, ఇతర అధికారులను కలసి పల్నాడులో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా జీవీఎల్ ఏమన్నారంటే..ప్రాజెక్టుల పురోగతిపై చర్చించాం.గతంలో కంటే అధికంగా రైల్వేల అభివృద్ధికి నిధులిచ్చాం.రైల్వే స్టేషన్లలో వసతులు పెంపు . ప్యాసింజర్ రైళ్ళను పునరుద్దరించాలని కోరాను.యాభై లక్షల నిధులను స్టేషన్లలో బెంచ్ ల కొనుగోలు కోసం ఎంపి లాడ్స్ ఇచ్చాను.జాతీయ రహదారుల అంశంలో ఐదేళ్ళలోనే అరవై ఏళ్ళలో చేసిన అభివృద్ధి మోడీ చేశారు.
పది రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు. రాజకీయాలే కాకుండా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. రైల్వే ప్రాజెక్టు ల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు లను రాష్ట్రం వినియోగించుకోవటం లేదు. బద్వేలులో పూర్తి శక్తి సామార్థ్యాలతో పోటి చేస్తున్నాం. వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. ఎన్నికల నుండి టిడిపి పారిపోతుంది. 2024లోనైనా పోటీ చేస్తుందో లేదో. వైసిపితో సర్థుబాటు రాజకీయాలు టిడిపి చేస్తుంది.
రెండు ఏళ్ళుగా ధర లేకపోవటంతో ప్రత్తి సాగు తగ్గింది.ఈ ఏడాది ప్రత్తి ధర బాగుంది. వచ్చే ఏడాది సాగు పెరుగుతుందని భావిస్తున్నాను. సిసిఐ అవసరమైనంత వరకూ మార్కెట్లోకి వచ్చే విధంగా చర్చిస్తాం. రైతులకు మంచి ధర వచ్చేలా చేస్తాం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, కోస్తాంధ్ర డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ శనక్కాయల అరుణ టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు, నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు అమర సైదారావు,రమాకుమారి,పునుగుల రవిశంకర్,అప్పిశెట్టి రంగారావు,రాచుమల్లు భాస్కర్,ఈదర శ్రీనివాసరెడ్డి,పాండురంగ విఠల్,కడారు వీరబ్రహ్మం,సురేష్,వెలగలేటి గంగాధర్, నాగమల్లేశ్వరి,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మోదీకి మద్దతునివ్వడం అందరి నైతిక బాధ్యత: జీవీఎల్
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రధాని మోదీకి మద్దతునివ్వడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. మోదీ సమర్ధ నాయకత్వం వల్లే మన దేశ ప్రతిష్ఠ


ప్రపంచంలో పెరిగిందన్నారు. యువతరానికి మోదీ సాధించిన విజయాలను వివరించాలని ఆయన బీజేపీ నేతలను కోరారు.
అమరావతి రోడ్డు లోని హిందు ఫార్మసీ కాలేజీ నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా నరేంద్రమోడీ జీవిత విశేషాలు తెలిపే ఎగ్జిబిషన్ ఫోటో గ్యాలరీను జీవీఎల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జూపుడి రంగరాజు,పాలపాటి రవికుమార్,ఉయ్యాల శ్యాంవరప్రసాద్, శ్రీనివాసరెడ్డి, గంగాధర్, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ నాగభూషణం సీతారామయ్య, సునీతాదేవి,గోవింద రాజన్,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE