Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్ బోర్డుకు ఆదాయం పెంచే దిశగా అడుగులు

– త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్లు పిలుస్తాం
– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

విజయవాడ: వక్ఫ్ బోర్డు కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జిల్లా ఎల్లార్తి గ్రామం షేక్ షావలి షాషావలి దర్గా టెండర్ల ద్వారా వక్ఫ్ బోర్డు కు ఆదాయం పెంచామని అన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్ల పిలుస్తామని తద్వారా వక్ఫ్ బోర్డు కు ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. వక్ఫ్ బోర్డు ను పారదర్శకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచడంతో పాటు, వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న రోజుల్లో వక్ఫ్ బోర్డు అభివృద్ధి, ముస్లిం సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు.

LEAVE A RESPONSE