Suryaa.co.in

Andhra Pradesh

కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల భారీ షాక్

– మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అందరు ఫైయిల్
– రెండవ సంవత్సరంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత

కమలాపురం: ఇంటర్ ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనందోత్సాహం నెలకొంది. మొత్తం 10,17,102 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు.ఈ సంవత్సరం మొదటి సంవత్సరం విద్యార్థులకు 70% ఉత్తీర్ణత శాతం, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదు కావడం గర్వకారణంగా మారింది.

వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ఫలితాలు విద్యార్థులు, తల్లిదండ్రులను షాక్ కు గురి చేశాయి. ఈ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన 33 మంది విద్యార్థులంతా ఫెయిల్ కావడం, రెండవ సంవత్సరం పరీక్షలు రాసిన 14 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడమే ఇందుకు కారణం ఏది ఏమైనప్పటికి గతంలో కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉండడం సంతోష దగ్గ విషయం.

LEAVE A RESPONSE