Suryaa.co.in

Andhra Pradesh

మైనారిటీల ఆర్థికాభివృద్ధికి రాయితీ రుణాలు

రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్

అమరావతి: రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టినట్టు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి అర్హత కలిగిన మైనార్టీలకు స్వయం ఉపాధి, నైపుణ్య, ఉపాధి కల్పన కోసం రూ.326 కోట్లు ఖర్చు చేసేందుకు, క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టిందని బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

మైనార్టీలకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున రూ.152.50 కోట్లు, వెచ్చింపునకు పాలనాపరమైన అనుమతులను జారీ చేస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు. మరో 50% రూ.152.50 కోట్లు రుణ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు అదనంగా రూ. 21.07 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా రాయితీ రుణాలను 19,790 మందికి, నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ద్వారా 29,428 మందికి మొత్తం లబ్ధిదారులు 49,218 మంది ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయూతను ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.

LEAVE A RESPONSE