Suryaa.co.in

Telangana

యాభై మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్న సునీతా ఫౌండేషన్

సొంత పిల్లల బాగోగులు చూసేందుకే సమయం లేని ఈ రోజుల్లో కొందరు తమ మానవ ద్రుక్పథాన్ని చాటుకుంటున్నారు. అనాథ పిల్లలను సైతం కన్న బిడ్డల్లా చూసుకుంటామంటోంది సునీతా ఫౌండేషన్ సంస్థ. ఆదరణ ఫౌండేషన్ లో ఉన్న అనాథ పిల్లల్లో యాబై మంది అనాథ పిల్లలను సునీతా ఫౌండేషన్ దత్తత తీసుకుంది.

ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ ఉన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సునీతా ఫౌండేషన్ చైర్మన్ సునీతా రెడ్డి తెలిపారు. తాము దత్తత తీసుకున్న అనాథ పిల్లలను ప్రయోజకులు గా తీర్చి దిద్దుతామని ఆమె చెప్పారు.తిండి బట్టలు, చదువు అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని, సొంత బిడ్డల్లాగా చూసుకుంటామని ఆమె అన్నారు.

ప్రతి రోజు సాయంత్రం పూట రోడ్ల పై నిద్రపోయే వ్రుద్దులకు సునీతా ఫౌండేషన్ తరఫున భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. అనాథ పిల్లల దత్తత కార్యక్రమంలో సునీతా ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెంకట్, కబడి జాతీయ క్రీడా కారుడు పుల్లారెడ్డి,ఆదరణ ఫౌండేషన్ చైర్మన్ మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE