కేంద్రం ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం గర్వకారణంగా ఉందని సీఎం జగన్ తెలిపారు.
‘మహిళలకు సాధికారత కల్పించడం మనకు చాలా ముఖ్యం.ఏపీలో నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన పథకాలతో మాత్రమే కాకుండా అన్నిరంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సాధికారత సాధించాం. కలిసికట్టుగా ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తును సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు.