– బండి సంజయ్‌ను కలసిన ఓ పాప తల్లి
– వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ
పాలమూరు జిల్లాలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో బండి సంజయ్ ని కలిసిన అలివేలు-ఆంజనేయులు దంపతులు.తమ 8 ఏళ్ల పాప గాయత్రికి మాటలు రావని, చేతులు కూడా ఫ్రీగా కదలవని తమ బాధను సంజయ్ ఎదుట చెప్పుకున్న గాయత్రి తల్లి అలివేలు.అత్యంత పేద కుటుంబం అయిన మమ్మల్ని మీరే ఆదుకోవాలని బండి సంజయ్ ని వేడుకున్న పాప తల్లి అలివేలు.
పాప పరిస్థితి చూసి చలించిపోయిన బండి సంజయ్
పాప గాయత్రి కి అయ్యే వైద్య ఖర్చులను తానే భరిస్తానని బండి సంజయ్ హామీ.తమకు సొంత ఇల్లు లేదని, కూలి పనులు దొరికితేనే పూట గడుస్తుందని… లేకపోతే ఆ రోజు ఇక పస్తే అని తమ గోడు బండి సంజయ్ కు చెప్పుకున్న అలివేలు సహా మరో నాలుగు కుటుంబ సభ్యులు. వచ్చేది పేదల ప్రభుత్వమేనని… బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చిన బండి సంజయ్.