తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు
కోట మైసమ్మ ఆలయ నిర్మాణం గొప్ప విశేషం
కోట మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొన్న “బక్కని”
నాడు శత్రు దుర్భేద్యమైన సవై వెంకట్ రెడ్డి అందమైన కోట..
అందులో సుందరమైన జానంపేట ఈ ప్రాంతంలో కొలువైన అతి ప్రాచీన కోట మైసమ్మ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం అద్భుత విషయమనీ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు.
సోమవారం పట్టణంలోని రైతు కాలనీలో అభివృద్ధి సంక్షేమ సంఘం, కోట మైసమ్మ సేవాసమితి, రుద్రవీణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణమైన కోట మైసమ్మ దేవాలయం ప్రారంభోత్సవ ఆధ్యాత్మిక వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుతో పాటు షాద్ నగర్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పాతూరి వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి బక్కని నరసింహులు మాట్లాడారు. చుట్టుముట్టు సవై వెంకట్ రెడ్డికి చెందిన కోట రాజుకు నివాస స్థలం ఇదని పేర్కొన్నారు. ఈ ప్రాంతం కోట మైసమ్మ కొలువై ప్రజలను గ్రామదేవత రూపంలో చల్లగా చూస్తోందని అన్నారు. నాటీ వల్లభాపురం నేటి జానంపేట ప్రాంతంలో ఈ ఆలయానికి గొప్ప విశిష్టత ఉందని అన్నారు. ఆలయాన్ని నిర్మించి భావితరాలకు ఆలయ ప్రాశ్చత్యాన్ని అలాగే కొనసాగించడం అభినందనీయమని, కాలనీ అభివృద్ధి కమిటీని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ప్రయాణించాలని అన్నారు.
దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన వారిని ఇవ్వని వారిని ఒకే రకంగా చూడాలని మనుషుల్లో ఆధ్యాత్మిక పరివర్తన మార్పు చెందే విధంగా కృషి చేయాలని హితబోధ చేశారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఆనాటి జానంపేట, ఫరూక్ నగర్ ప్రాంతాల పరి పాలన చారిత్రక ఇతిహాసాలను ఆయన భక్తులకు సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పాతూరి వెంకట్రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, రమేష్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టు ఏపీ శుక్ర వర్ధన్ రెడ్డి, రవీందర్ జగన్ గౌడ్ మల్లేష్, ప్రదీప్ రామచంద్రయ్య పెంటయ్య చెరుకు శివ, కార్తీక్, స్వాతి శివ మల్లేష్, దినేష్, బాలయ్య, మారుతి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.