సీఎం జగన్ ని కలిసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

జాతీయ స్థాయి వైద్య విద్య పరీక్ష (నీట్)-2021లో ఎమ్మెల్యే శ్రీదేవి కుమార్తె కే. విజయ వెంకట భవ్య 40ర్యాంకు (ఎస్సీ కేటగిరి) సాధించిన సందర్భంగా అభినందనలు తెలిపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉన్నత చదువులు చదివి తల్లికి తగ్గ తనయరాలిగా పేరు సాధించాలని సూచించిన సీఎం జగన్.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా జాతీయ స్థాయి వైద్య పరీక్ష (నీట్)-2021లో ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి కుమార్తె కే. విజయ వెంకటభవ్య 40వ ర్యాంకు సాధించిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. తల్లికి తగ్గ తనయురాలిగా వెంకట భవ్య పేరు సాధించాలని ఆశీర్వదించారు. తాడికొండ నియోజకవర్గంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల గురించి సీఎం జగన్ కు ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు చూసి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని తెలిపారు.
తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి సంబందించిన వినతి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
తాడికొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పత్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి వినతి అందచేశారు… తాడికొండ మండలం లాం గ్రామంలో కొండవీటి వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించేలా అనుమతులు ఇవ్వడంతో పాటు.. పొన్నెకల్లు-గరికపాడు గ్రామల మధ్య నూతన కల్వర్టులు నిర్మాణం చేయాలన్నారు. అలాగే తాడికొండ గ్రామం నుంచి కంతేరు ఆర్ అండ్ బి రహదారిని రెండు వరుసలు వేస్తె.. జాతీయ రహదారికి ప్రజలు మరింత సులువుగా చేరుకుంటారని సీఎం జగన్ కు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.అలాగే పెదపరిమి గ్రామంలో ఉన్న కోటేళ్ళ వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.
ఫిరంగిపురం మండలం పర్యాటక రంగానికి అనువుగా ఉంటుంది
తాడికొండ నియోజకవర్గంలో ఫిరంగిపురం పర్యాటక రంగానికి అనువైన ప్రదేశమని సీఎం జగన్ కు ఎమ్మెల్యే శ్రీదేవి సూచించారు.. ఫిరంగిపురం కొండపై ఉన్న కార్మేల్ మాత చర్చి ఘాట్ రోడ్డుని రీ- శాంక్షన్ చేయాలని కోరారు.. దీంతో పాటు తాడికొండ గ్రామంలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ కొండ మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్లేలా ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు.. అలాగే తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్(సీ.హెచ్. సీ) నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.
శాసనరాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించండి
శాసన రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు.. తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల అన్ని కలిపి ఓ మున్సిపాలిటీగా చేయడంతోపాటు. రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్ల భూముల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్ళకంపలను తొలగించాలని కోరారు… రాజధాని మిగులు భూముల్లో ఐటీ హబ్, ఎడ్యుకేషన్ హబ్, స్టేడియ నిర్మాణం చేయాలని కోరారు. రాజధాని నాన్ పూలింగ్ గ్రామాలైన వడ్డమాను, పెదపరిమి, హరిచంద్రపురం గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చూడాలన్నారు… సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీదేవి అందజేశారు.
సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది
సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో మరింత బలం పెరిగిందని ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు.. తాడికొండ నియోజకవర్గ ప్రజలు, సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా… నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు… ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి వెంట తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ భీమవరపు బ్రహ్మారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు తాళ్ల శివ నాగరాజు ఉన్నారు.

Leave a Reply