Suryaa.co.in

Telangana

మిస్ ఇంగ్లాండ్ పై కాంగ్రెస్ ఎంపి చిలిపి చేష్టల పై చర్యలు తీసుకోండి

– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు పైనే విచారణ పేరిట కేసీఆర్ ,హరీష్ రావులను పిలిచారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ తో రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది . ఫార్ములా ఈ రేసింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షతోనే కే టీ ఆర్ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.

కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లపై ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు సఫలం కావు. కావాలనే కక్షతో కేటీఆర్ మీద కేసులు పెట్టిన విచారణ పేరుతో వేధిస్తున్నారు. కేటీఆర్ మీద కేసు పెట్టడం కాదు. ఎన్నికల ప్రచారం గ్యారంటీ కార్డు చూపిస్తూ ఓట్లు వేసుకొని మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల మీద కేసు పెట్టాలి.

కేటీఆర్ మీద అరవడం కాదు. మిస్ ఇంగ్లాండ్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన చిలిపి చేష్టల పై చర్యలు తీసుకోండి. మహిళలకు ఉచిత బస్ ఒక్కటే చేశారు. అదే మహిళలకు 2500 వేయలేదు.4000 వేలు ఫించన్లు ఇయ్యలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీల అమలు చేయకుండా కేవలం రాజకీయ కక్షతో కేటీఆర్ ను విచారించడం సబబు కాదు.

డైవర్ట్ రాజకీయాలు : మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

కావాలనే కక్షతో కేటీఆర్ మీద కేసులు పెట్టిన విచారణ పేరుతో వేధిస్తున్నారు. కేటీఆర్ మీద కేసు పెట్టడం కాదు..ఎన్నికల ప్రచారం గ్యారంటీ కార్డు చూపిస్తూ ఓట్లు వేసుకొని మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల మీద కేసు పెట్టాలి. మహిళలకు ఉచిత బస్ ఒక్కటే చేశారు .అందాల పోటీల పేరు తో డబ్బులు వృధా చేశారు. అందాల పోటీల్లో మహిళలను ఆవమాన పరిచిన వారి పై ముందు చర్యలు తీసుకోoడి. హామీలు అమలు చేయకుండా డైవర్ట్ రాజకీయాలు చేస్తే కుదరదు.

సీతక్క ఒక్కమాట, పొంగులేటి మరో మాట : ఎమ్మెల్యే కోవా లక్ష్మీ

ఎవరికీ పొంతన లేదు. లోకల్ ఎన్నికల మీద సీతక్క ఒక్కమాట, పొంగులేటి మరో మాట.. వెంటనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఖండించడం.. అవగాహన లేని మంత్రులు. కేసీఆర్ పై కావాలనే రాజకీయ కక్షతో కమీషన్ ఎదుట విచారణ చేయడం సబబు కాదు. సీతక్క అంటుంది. కవిత జైలు కు పోయింది. కేటీఆర్ నీకు జైలుకు పోవాలని ఉందా అంటూ మంత్రి హోదా లో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

కేటీఆర్ పై తప్పుడు ప్రచారం : మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రేవంత్ ఫార్ములా తోనే కేటీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల మీద కన్నేసి కేటీఆర్, హరీష్, కేసీఆర్ మీద కేసులూ పెట్టి వేధిస్తున్నారు.
మహిళలకు ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వేధిస్తున్నారు.

ఆర్థిక శాఖపై ఎవరికీ ధ్యాస లేదు. మంత్రికి మంత్రి అవగాహన లేదు‌. అంతా ఆగమాగం చేస్తున్నారు. పాలించడం చేత కాక కేవలం రాజకీయ పబ్బం గడుపుతున్నారు. 10 ఏండ్లు అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన కేసీఆర్ ను విచారణ చేయడం కరెక్ట్ కాదు.

మా దగ్గర కేసీఆర్ ఫార్ములా ఉంది.. మా వారు అందరు కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు. దయచేసి డైవర్ట్ కవరింగ్ పాలిటిక్స్ చేయడం మానేస్తే మంచిది రేవంత్ రెడ్డి. టైం పాస్ కోసమే కేటీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు.. మళ్ళీ అధికారంలోకి తిరిగి వస్తాం.

LEAVE A RESPONSE