విజయసాయి,దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి

Spread the love

– పోలీసులకు తెలంగాణ టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన, షకీలారెడ్డి ఫిర్యాదు

తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ సోషల్‌మీడియా ఇన్చార్జి, ఏపీలో కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న దేవేందర్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ టీడీపీ డిమాండ్‌ చేసింది. ఆ మేరకు పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, కార్యనిర్వహక కార్యదర్శి షకీలా రెడ్డి బంజారాహిల్స్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు-లోకేష్‌పై సోషల్‌మీడియాలో అనాగరిక భాషవాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోకపోతే సహించేది లేదని హెచ్చరించారు. బజారుభాష వాడుతున్న ఆ ఇద్దరిపై, త క్షణం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు మ‌హిళా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సూర్య‌దేవ‌ర ల‌త, వాహిద్‌, అశోక్‌, గోవింద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply