Suryaa.co.in

Andhra Pradesh

స్పీకర్ గా తమ్మినేని అన్ ఫిట్

– ఇలాగే పాలన కొనసాగిస్తే..జగన్ కి రివర్స్ అయితది.
– కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాగే చేస్తే జగన్‌కే ఏదో ఒకరోజు రివర్స్ అవుతుందని హెచ్చరించారు. జగన్‌కు సీఎం పదవి శాశ్వతం కాదని, రాజకీయాలు హుందాగా ఉండాలని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ మాట జారినప్పుడు విచారం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్లు వైఎస్‌ ప్రకటించారని తెలిపారు. జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చూడలేదని పేర్కొన్నారు.
ఎవరికైనా దూషణలు సరికాదు.అదే మాట జగన్ నో.. నాని నో అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి.స్పీకర్ కుర్చీ సీఎం ఇచ్చినా… ప్రతిపక్ష నాయకుడి కుటుంబం పై దూషణలు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు. స్పీకర్ గా తమ్మినేని అన్ ఫిట్.కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలి.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.. పార్టీకి సంబందం లేదు. బాబు తిట్టేటప్పుడు… జగన్ నవ్వు దేనికి సంకేతం?వచ్చే ఎన్నికల్లో బాబు నీ గెలిపిస్తే… నీ పరిస్థితి ఎంటి జగన్? చంద్రబాబు నన్ను గుర్తు పట్టే పరిచయం కూడా నాకు లేదు.
కానీ ఓ సీనియర్ నాయకుడికి అలా అవమానించడం సరికాదు . జగన్ ఇవాళ సీఎం..తోపు కావచ్చు.ఇలాగే పాలన కొనసాగిస్తే..జగన్ కి రివర్స్ అయితది. తోటి తెలుగు రాష్ట్రం కాబట్టి స్పందిస్తున్న. ప్రజాస్వామ్యం లేని పాలన అనిపిస్తుంది. జగన్ టీం… బాబు చేసిన అవమానం ఖండిస్తున్నా. ప్రవర్తన సరికాదు..సమాజం కి తప్పుడు సంకేతం పంపారు.

LEAVE A RESPONSE