Suryaa.co.in

Andhra Pradesh

ఆ కుటుంబాల‌కు 25ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని టిడిపి డిమాండ్

-కల్తీ కల్లు మృతుల కుటుంబాల‌కు 25 ల‌క్ష‌ల ప‌రిహారం అందించాల‌ని టిడిపి డిమాండ్
– రాజ‌వొమ్మంగి మండ‌లం లోదొడ్డిలో క‌ల్తీ క‌ల్లు మృతుల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబుకు పార్టీ నేత‌ల నివేదిక‌

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజ‌వొమ్మంగి మండలం లోదొడ్డి కల్తీ కల్లుఘటనపై టిడిపి అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు నివేదిక అందజేశారు. లోదొడ్డిలో ఫిబ్రవరి 2 న‌ జీలుగ కల్లులో విషం కలిపిన ఘటనలో 5 గురు గిరిజనులు మృతి చెందారు. దీనిపై ప‌రిశీల‌నకు గిరిజన నేత‌ల‌తో పార్టీ క‌మిటీని ఏర్పాటు చేసింది. స్థానిక వాలంటీర్ రాంబాబు అనే వ్యక్తి…..ఇదే గ్రామానికి చెందిన గంగరాజుపై వ్యక్తి గత కక్షతో కల్లులో విషం కలిపి 5గురు ప్రాణాలు కోల్పోడానికి కారణం అయ్యారని టిడిపి బృందం చంద్రబాబుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఘటనలో సుగ్రీవులు, లోవరాజు,గంగరాజు, సన్యాసరావు, ఏసుబాబు ప్రాణాలు విడిచారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు అంతా నిరుపేదలు, కూలీలు అని….ఘటనపై ప్రభుత్వం కనీస మాత్రం స్పందిచలేదని టిడిపి నిజ నిర్థారణ కమిటీ నేతలు తెలిపారు. విష ప్రయోగంతో ఉన్న బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు కనీసం వెయ్యి రూపాయలు లేకపోవడంతో ఆలస్యం జరిగి మూడు ప్రాణాలు పోయినట్లు నివేదికలో వారు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మృతుల‌ కటుంబాలకు ఒక్కోక్కరికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

LEAVE A RESPONSE